హైదరాబాద్

ప్రతి బొట్టు.. లెక్కకు రావల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరవాసుల దాహర్తిని తీర్చేందుకు జలమండలి సరఫరా చేస్తున్న నీటిలోని ప్రతి బొట్టు లెక్కకు రావల్సిందేనని అధికారులను జలమండలి ఎండీ దాన కిషోర్ ఆదేశించారు. ఇందుకు గాను ప్రతి సెక్షన్‌కు చెందిన జనరల్ మేనేజర్ తన పరిధిలో లెక్కకు రాకుండా పోతున్న నీటిలో కనీసం పది శాతాన్ని తగ్గించాలని లక్ష్యాలను విధించారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ బుధవారం ఖైరతాబాద్‌లోని బోర్డు ఆఫీసులో రెవెన్యూ పెంపు, అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించేందుకు ప్రతిరోజు నిర్వహిస్తున్న వాక్ కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి సెక్షన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు ఇచ్చిన లక్ష్యం ప్రకారం నీటిని తగ్గించగలిగితే బోర్డుకు రూ.10 కోట్లు డబ్బు ఆదా అవుతోందని వివరించారు. డిసెంబర్ నాటికి ఎంత నీటి వృథాను అరికట్టారో సెక్షన్ల వారీగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పదిశాతం బిల్లుల జారీ, కలెక్షన్ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈనెల చివరి నాటికి ప్రతి మేనేజర్ 20 మంది వాక్ వాలంటీర్ల సాయంతో కనీసం 850 ఇళ్లకు నీటి పొదుపుపై ఎరుపు, ఆకుపచ్చ, రంగులతో గుర్తులను వేయాలని టార్గెట్ పెట్టారు. నూతనంగా ఇచ్చే నల్లా కనెక్షన్‌కు ఏఎంఆర్ మీటర్లను భిగించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించే మేనేజర్లు, లైన్‌మెన్లు అనుమతులు లేకుండా తీసుకున్న నల్లా కనెక్షన్లను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లను లేకుండా చూసుకోవాలని సూచించారు. సమావేశంలో జలమండలి ఆపరేషన్స్-2 డైరెక్టర్ పి.రవి పాల్గొన్నారు.
బోర్డును సందర్శించిన చెన్నై అధికారులు
నీటి పొదుపు, ఇంకుడు గుంతల నిర్మాణం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు జలమండలి నిర్మించిన రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కును బుధవారం చెన్నై నగరానికి చెందిన జలమండలి అధికారుల బృందం సందర్శించింది. చెన్నై జలమండలి సూపరింటెండెంట్ ఇంజనీర్ సమీలాల్ జాన్‌సన్, డిప్యూటీ హైడ్రాలజిస్టు పీ.సుబ్రహ్మణ్యన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీఎస్ ఉమశంకర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.ప్రవీణ్.. థీమ్‌పార్కును సందర్శించి, పార్కు విశేషాలను, వివిధ నీటి సంరక్షణ చర్యలు, నీటిని ఓడిసిపట్టి చర్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత జలమండలి బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ దాన కిషోర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జలమండలిలో చేపడుతున్న బిల్లింగ్, మీటర్లు, రెవెన్యూ వంటి అంశాలపై వివరాలను తెలుసుకున్నారు.