హైదరాబాద్

10 నుంచి ఎస్‌ఎఫ్‌ఏ చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్‌ఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జంట నగరాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులకు క్రీడోత్సవాలను నిర్వహించనుంది. పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఎస్‌ఎఫ్‌ఏ మూడు సంవ్సరాల నుంచి పోటీలను నిర్వహిస్తు వస్తోంది. ఎస్‌ఎఫ్‌ఏ చాంపియన్‌షిప్-3వ సీజన్ వచ్చే నెల 10 నుంచి 19 వరకు నిర్వహించనుంది. గచ్చిబౌలి, లాల్‌బహదూర్ స్టేడియంతో పాటు ఇంధీరాపార్క్ టెన్నిస్ కోర్టులో పోటీలు జరుగుతాయి. పది రోజుల పాటు జరుగనున్న ఈ క్రీడోత్సవాల్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, సన్‌ప్లవర్ వేదిక్ స్కూల్, విజ్ఞాన్ విద్యాలయ నిజాంపేట్, నాసర్ స్కూల్, రాక్‌వెల్ ఇంటర్నేషనల్, మెరిడియన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాటు అనేక పాఠశాలల జట్లు పాల్గొననున్నాయి. పది రోజుల పాటు సాట్స్ స్టేడియం గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియం, ఇందీరాపార్క్ తదితరు ప్రాంతాలలో నిర్వహించే ఈ పోటీలో మొత్తం 20 క్రీడాంశాల్లో పొటీలు జరుగనున్నాయి. బాస్కెట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, హాకీ, హ్యాండ్‌బాల్, ఖోఖో, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, కరాటే, స్విమ్మింగ్, ఆర్చేరి, క్యారమ్, చెస్, స్కేటింగ్ తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. చిన్నారులను క్రీడల వైపు మళ్లించి వారిలో దాగిఉన్న క్రీడా నైపుణ్యన్ని వెలికి తీసేందుకు ఈ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఎ సంస్థ వ్యవస్థాపకుడు రిషికేశ్ జోషి తెలిపారు. ప్రతి చిన్నారి క్రీడల పట్ల అవగాహన కలిగించేందుకు టోర్నమెంట్‌లను నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఏ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముంబాయి, హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పాఠశాలల క్రీడోత్సవాలో దాదాపు 1700 పాఠశాలలకు చెందిన లక్ష 3వేల మంది విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థ ఎండీ రెడ్డి, భారత క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ వైస్ చైర్‌పర్సన్ రాణి రుద్రమా దేవి, ప్రిన్సిపాల్ వందన, నాసర్ స్కూల్ ప్రతినిధులు హఫీజుద్దీన్ అహ్మద్, మోనుద్దీన్ మహ్మద్ పాల్గొన్నారు.