హైదరాబాద్

సఫాయి కర్మచారుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సఫాయి కర్మచారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి సానుకూలంగా పనిచేయాలని జాతీయ సఫాయి కమిషన్ సభ్యులు జగదీశ్ హిర్మాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో మ్యానువెల్ స్కావెంజింగ్ నిర్మూలన, ప్రత్యామ్నాయ పునరావాస చట్టం-2013 అమలుపై కర్మచారి కమిషన్ సభ్యుడు జగదీశ్ హిర్మాణి హాజరై సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశాలు కేవలం సమీక్షించుకునేందుకు మాత్రమే పరిమితం కాకుండా కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదికలు కావాలని అన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతకు సంబంధించి సఫాయి కర్మచారులు అధునాత యంత్రాలను కొనుగోలు చేసేందుకు వినియోగించాలని సూచించారు. 2013లో వచ్చిన చట్టం ప్రకారం సఫాయి కర్మచారులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమష్టిగా కృషిచేసి వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని సూచించారు. 2022 నాటికి కనీస వేతనం చట్టం కింద సఫాయి కర్మచారిల జీవన భద్రత కోసం జీతభత్యాలు, ఆరోగ్య బీమా, క్రమంగా తప్పకుండా వైద్య పరీక్షలు, సుస్థిర నివాసం, పిల్లల విద్యాభ్యాసం వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సఫాయి కర్మచారిలు ప్రభుత్వం అందించే చేయూత విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహారించినట్లయితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ కింద సఫాయి కర్మచారుల అభివృద్ధికి నిధులు కేటాయించామని, సంబంధిత బ్యాంకులు ఆ నిధులను లబ్ధిదారులకు సకాలంలో అందించేలా కృషి చేయాలని సూచించారు. సఫాయి కర్మచారులు వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించుకండా విధులు నిర్వర్తిసుంటారని, వారి కోసం ప్రభుత్వం తనన్ని వైద్య శిబిరాలను క్రమంగా తప్పకుండా నిర్వర్తించి, వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్య కోర్సుల్లో తగిన శిక్షణనిప్పించి, వారి ఆర్థికాభివృద్ధికి చేయూత అందించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా సఫాయి కర్మచారిల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరంలో 33 మందికి ఆర్థిక చేయూత, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి 84 మందికి ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, వృత్తి నైపుణ్య కోర్సులు వంటి ఎన్నో చర్యలు చేపట్టినట్లు వివరించారు. సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు తరుణ్ జోషి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యానాయక్, ఎల్జీఎం శ్రీనివాస్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ స్వామి పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను
కేటాయించాలి
సమీక్షలో భాగంగా వివిధ సఫాయి కర్మచారి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, రుణాలు, మేధర భవన్ ఏర్పాటు, వ్యాపారం చేసుకునేందుకు వీలుగా షాపుల కేటాయింపు తదితర అంశాలను సపాయి కర్మచారి జాతీయ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన సభ్యుడు జగదీశ్ వీలైనంత మేరకు కార్మికుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలను చేపడుతామని హామీ ఇచ్చారు.