హైదరాబాద్

రైతులు నష్టపోకుండా మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పత్తి రైతులు నష్టపోకుండా పత్తికి మద్దతు ధర కల్పించాలని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2091- 20 పత్తి మద్దతు ధర కొనుగోళ్లపై సంబంధిత జిల్లా స్థాయి కమిటీ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సీసీఐ మహబూబ్‌నగర్, స్పిన్నింగ్ మిల్లుల నిర్వాహకులతో సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ 2019- 20 సంవత్సరానికి పత్తికి మద్దతు ధర రూ.5550, జిల్లాలో గత సంవత్సరంలో 12 పత్తి స్పిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి రైతులకు పేమెంట్‌లో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు.

సుమన్‌కు ‘డా.అక్కినేని సినీ పురస్కారం’ ప్రదానం

కాచిగూడ, సెప్టెంబర్ 19: నట సామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్‌కు ‘డా.అక్కినేని సినీ పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీసాయి సంగీత అకాడమీ ఆధ్వర్యంలో గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సామాజికవేత్త దాము గేదల పాల్గొని సుమన్‌కు పురస్కారం ప్రదానం చేశారు. అక్కినేని అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలచిపోయారని తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ‘ ఎఎన్‌ఆర్’ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు ప్రత్తిపాటి ప్రభాకర్ నాయుడు నిర్వహణలో గాయనీ, గాయకులు లక్ష్మీ భారతి, వెంకీ, సుజాత, మనోహర్ రావు, శృతి, సంధ్య, గంగరాజు అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త డా.కొత్త కృష్ణవేణి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, వైకే నాగేశ్వర రావు, సంస్థ అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, ప్రత్తిపాటి రాధ పాల్గొన్నారు.