హైదరాబాద్

సఫాయి కర్మచారులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలోని కోటి మంది దాహర్తిని తీర్చే జలమండలి మినీ జెట్టింగ్ మిషన్లతో మానవ రహిత పారిశుద్ధ్య పనులను ప్రారంభించటం సఫాయి కర్మచారిలకు శుభపరిణాం అని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ జగదీశ్ హిర్మాణి అభినందించారు. గురువారం జలమండలిని సందర్శించిన జగదీశ్ బోర్డు పరిధిలోని కార్మికులకు అందిస్తున్న ప్రయోజనాలు, యంత్రాల వినియోగం, యూనియన్ ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ హిర్మాణి మాట్లాడుతూ మానవ రహిత పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు జలమండలి అనేక కొత్త ఆవిష్కరణలు చేసిందని, మున్ముందు మరిన్ని ఆవిష్కరణలు చేయాల్సి ఉందని సూచించారు. కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగకుండా యంత్రాల ద్వారా శుభ్రం చేయటం సఫాయి కర్మచారులకు మంచి పరిణామంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం మ్యానువెల్ స్కావెంజింగ్ నిర్మూలన, ప్రత్యామ్నాయ పునరావాస చట్టం 2013ను ప్రవేశపెట్టిన మ్యానువెల్ టు మెకానిజం అనే పథకాన్ని మొట్టమొదటి సారిగా నగరంలోని జలమండలి ఆచరించిందని వివరించారు. జెట్టింగ్ మిషన్ల వినియోగంతో పనులు వేగవంతంగా జరగటంతో పాటు స్కావెంజింగ్ పనులు చేపట్టే కుటుంబాలే కాంట్రాక్టర్లుగా మారటం అభినందనీయం అన్నారు. జలమండలి ఎండీ దాన కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగి పని చేయటాన్ని 2016లోనే నిషేధించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య పనుల్లో ఇబ్బందులు కలగకుండా 58 జెట్టింగ్ యంత్రాలకు తోడు 72 మినీ జెట్టింగ్ య త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అలాగే మ్యాన్‌హోల్‌లో అడ్డంకులను తొలగించేందుకు రోబోటిక్ యంత్రాలు పైప్‌లైన్‌తో ఉన్న వాయువులను గుర్తించేందుకు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ వీఎల్.ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్స్-2 డైరెక్టర్ పి.రవి, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు.