హైదరాబాద్

ఆదాయ మార్గాల అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నెలకు మొత్తం వ్యయం రూ.147 కోట్లు
* రూ.వంద కోట్ల నుంచి రూ.115 కోట్ల రాబడి
* మిగతా నిధుల కోసం మార్గాలు వెతుకుతున్నాం
* జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడి

హైదరాబాద్, కోటి మంది జనాభాకు అవసరమైన, అత్యవసరమైన సేవలను అందించే జీహెచ్‌ఎంసీకి నెలకు రూ. 147 కోట్ల వ్యయమవుతోందని, ఇందులో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం కారణంగా రూ. వంద కోట్ల నుంచి రూ. 115 కోట్ల వరకు వివిధ ఆదాయమార్గాల ద్వారా సమకూరుతున్నా, మిగిలిన మరో రూ. 32కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు నిధులను సమీకరించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఆదాయ మార్గాలను అనే్వషిస్తున్నట్లు బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ప్రాజెక్టుల బిల్లులు కాకుండా రొటీన్ మెయింటనెన్స్, సిబ్బంది, ఉద్యోగుల జీతభత్యాలు వంటి వాటికి నెలకు రూ. 147 కోట్లు కావల్సిందేనని, ఇందులో రూ. వంద కోట్ల నుంచి రూ. 115 కోట్ల వరకు సమకూరుతున్నట్లు వివరించారు. నెలవారి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన మరిన్ని నిధుల కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అనే్వషించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్‌గా పెట్టుకున్న రూ. 1800 కోట్ల ఆస్తిపన్నును లక్ష్యానికి తగిన విధంగా కాస్త ముందుగానే వసూలు చేయాలని, అందుకు అవసరమైన ఆదేశాలిచ్చినట్లు ఆయన వెల్లడించారు. మరోసారి బాండ్ల జారీతో నిధులను సమీకరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతమున్న అవసరాలు తీరేందుకు వీలుగా గత సంవత్సరం ఇదే నెలలో ఆస్తిపన్ను చెల్లించి, ప్రస్తుతం చెల్లించని బకాయిదారులను సంప్రదించి, పన్ను చెల్లించమని కోరాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. మహానగరంలో రూ.3లక్షల్లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఆస్తులను రీ అసెస్‌మెంట్ చేయాలని భావిస్తున్నట్లు, ఈ ప్రయత్నం ఫలిస్తే జీహెచ్‌ఎంసీకి కొంత మేరకు శాశ్వత ప్రాతిపదికన నిధులు సమకూరే అవకాశముంటుందని ఆయన వెల్లడించారు. రోజురోజుకి పట్టణీకరణ పెరుగుతుండటంతో కమర్షియల్ లావాదేవీలు కూడా పెరుగుతున్నందున, గతంలో ఎపుడో అసెస్‌మెంట్ చేసిన ఈ ఆస్తులకు సంబంధించి అదనంగా అంతస్తులు గానీ, వినియోగంలో మార్పు వంటివి వచ్చినట్లయితే అదనంగా పన్ను విధించేందుకు అవకాశముంటుందని వెల్లడించారు.