హైదరాబాద్

వ్యాధుల నివారణకు పక్కా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : వాతావరణంలో కలుగుతున్న మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పక్కా ప్రణాళికతో దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వెల్లడించారు. దోమలు, వ్యాధుల నివారణ విషయంలో ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో అందుబాటులో ఉన్న మ్యాన్‌పవర్, మిషనరీని రౌండ్ ది క్లాక్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దోమల వల్ల కలిగే వ్యాధుల బారి పడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో అవగాహన కలిగితే వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిలో కూడా అవగాహన పెరిగే అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలోని 2వేల 375 మంది సిబ్బంది నిరంతరంగా లార్వా నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు విద్యార్థులు, ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను కూడా చేపట్టినట్లు వివరించారు. ఎంటమాలజీ విభాగంలోని 650 బృందాలు ప్రతిరోజు సుమారు 40వేల గృహాలను సందర్శించి, నీటి నిల్వలు లేకుండా, ఒకవేళ ఉన్నా, వాటిని శుభ్రం చేస్తున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో అందుబాటులో ఉన్న 150 పోర్టబుల్, పది ఫాగింగ్ మిషనన్లను వాహనాల ద్వారా వినియోగిస్తూ రోజూ 150 కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్ జరిగినట్లు కాలనీ సంక్షేమ సంఘాలు, కార్పొరేటర్ల నుంచి ధృవీకరణ సంతకాలను స్వీకరిస్తున్నామని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై రిస్కు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు. నగరంలోని నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఒక్కోదానిలో 25 మంది అదనపు డాక్టర్లను నియమించి, అదనంగా ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటితోపాటు నగరంలో ఉన్న 95 అర్బన్ హెల్త్‌సెంటర్లలో ఈవెనింగ్ క్లీనిక్‌ను, 105 బస్తీ దవాఖానాల్లో పూర్తి స్థాయిలో మందులను, సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటిల్లో సీజనల్ వ్యాధులతో వచ్చేవారి రక్తశ్యాంపిల్స్ సేకరించి, అదేరోజు రిపోర్టు వచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీటిల్లో 200 రకాల వైద్య పరీక్షలు, మరో 150 రకాల మందులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ అర్బన్ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాలకు వచ్చే వారికి కేవలం గంటల వ్యవధిలోనే రక్త పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా రెండు శ్యాంపిల్స్ సేకరించి, ఒకటి వారు పరీక్షలు చేసేందుకు, మరొకటి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. గడిచిన కొంతకాలంగా డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు తరుచూ నమోదైన ప్రాంతాలను హై రిస్కు ప్రాంతాలుగా పేర్కొన్నారు. గడిచిన మూడేళ్ల డేటాను సేకరించిన బల్దియా అధికారులు తరుచూ డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, కాస్త ముందస్తుగా స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు వరుసగా నిర్థారణ అయిన ప్రాంతాలను గుర్తించారు. అత్తాపూర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు గల మూసీ పరివాహక ప్రాంతాల్లో 126 మంది సభ్యులతో ప్రత్యేక యాంటీ లార్వా ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

రాజేంద్రనగర్‌లో భారీ వర్షం
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 20: రాజేంద్రనగర్ సర్కిల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి సర్కిల్ ప్రధాన కూడళ్లు, చౌరస్తాలలో రోడ్లన్నీ నిండిపోయాయి. సర్కిల్లోని రాజేంద్రనగర్, ఆరాంఘర్, శివరాంపల్లి, బుద్వేల్, హైదర్‌గూడ, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. సగం లోతు వరకు కార్లు నిండిపోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అంజనాద్రిలో అగ్నిప్రమాదం
ఉప్పల్, సెప్టెంబర్ 20: కాచవానిసింగారం గ్రామంలోని బాలాజీ అంజనాద్రి టౌన్‌షిప్‌లో నివసిస్తున్న సందీప్ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కాలి బూడిదై ఆస్తినష్టం జరిగింది. సందీప్ భార్యతో కలిసి ఉద్యోగానికి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది నీటిని తెప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక కేంద్రం ఇక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పింది. లక్షల్లో ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
భూ బాధితులకు అండ
షాబాద్, సెప్టెంబర్ 20: చందనవెల్లి భూ బాధితులకు అండగా ఉంటామని టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నేడు చందనవెల్లి గ్రామంలో భూములు కోల్పోయిన బాధితులకు అండగా ఉండేందుకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండ విశే్వశ్వర్‌రెడ్డి అఖిల పక్షం నాయకులు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు అందరూ వచ్చి చందనవెల్లి భూ బాధితులకు అండగా ఉండాలని తెలిపారు.
హోంగార్డు విధులకు ఆటంకం
నిందితుడి అరెస్టు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 20: రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న ఓ హోంగార్డు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నిరూస్ జంక్షన్ వద్ద హోంగార్డు మహేష్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్‌లో వెళుతున్న అంకారావును ఆపి వచ్చిన రూట్‌లో వెళ్లి తిరిగి రావాలని సూచించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోతూ నేను రాంగ్ రూట్‌లో వెళతా అవసరమైతే ఫోటోలు తీసుకో అంటూ అతనిపై దాడికి యత్నించాడు. దీంతో సదరు జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాదాపూర్‌కు చెందిన అంకారావును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి
షాద్‌నగర్, సెప్టెంబర్ 20: పెండింగ్‌లో ఉన్న ఆశావర్కర్ల వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకులు సాయిబాబా డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో వేతనాలను చెల్లించాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వరకు ఆశావర్కర్లతో ర్యాలీగా వెళ్లి, ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓ కృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మట్లాడుతూ ఆరునెలలుగా ఆశావర్కర్ల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్లకు ఏ విధమైన వేతనాలు చెల్లిస్తున్నారో..అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశావర్కర్లకు వేతనాలు అందించాలని తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగా మిగిలాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారని ఆరోపించారు. ప్రభుత్వం ఆశావర్కర్లతో వెట్టిచాకిరి చేయించుకుంటూ..వేతనాలు మాత్రం సరిగ్గా చెల్లించడం లేదని వాపోయారు. గ్రామాల్లో ఆశావర్కర్లు వచ్చిన తరువాతనే గర్భిణీలకు, బాలింతలకు, పుట్టిన పిల్లలకు సంబంధించి మంచి సూచనలు, సలహాలు చేస్తూ..వారిని ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తున్నారని వివరించారు. ఆశావర్కర్లపై పనిభారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశావర్కర్లకు కనీస వేతనంగా రూ.18000వేలను అందించాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఆశావర్కర్ల వేతనాలను చెల్లించడంతో పాటు కనీస వేతనాన్ని అందించాలని అన్నారు. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు కవిత, శ్రీనునాయక్‌లతో పాటు ఆశావర్కర్లు పాల్గొన్నారు.

అమ్మవారి మండపానికి భూమి పూజ
నేరేడ్‌మెట్, సెప్టెంబర్ 20: మల్కాజిగిరి గాంధీ పార్కులో జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గమాత అమ్మవారి మండపానికి మల్కాజిగిరి కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ శుక్రవారం కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, వినయ్ గౌడ్, కోటేష్, సంజయ్, సురేష్, జ్ఞానేశ్వర్, రాజు, సూరీ పాల్గొన్నారు.
పరిశుభ్రత..పచ్చదనం అందరి బాధ్యత
ఉప్పల్, సెప్టెంబర్ 20: పరిశుభ్రత.. పచ్చదనం అందరి బాధ్యత అని కాచవానిసింగారం గ్రామ సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి అన్నారు. గ్రామంలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం ఉపసర్పంచ్ విష్ణు గౌడ్, వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి శుక్రవారం శ్రమదానం చేశారు. బాలాజీ అంజనాద్రి, మణిదీప్ కాలనీలో చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ప్రధాన రహదారిలో ఇరువైపుల మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములై విష జ్వరాలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.