హైదరాబాద్

కార్మికులు ప్రత్యామ్నాయం కోరుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మింట్‌కాంపౌండ్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రెస్ కార్మికులు టీఆర్‌ఎస్ యూనియన్‌కు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, ఆ ప్రత్యామ్నాయ శక్తి బీఎంఎస్ అని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కే.శంకర్ అన్నారు. శనివారం ప్రెస్ యూనియన్‌కు జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి కే.శంకర్ కార్మికులను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ బీఎంఎస్‌ను గెలిపిస్తే, ముద్రణాలయంలో ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తెచ్చే అంశంపై ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. శంకర్ మాట్లాడుతూ ఇటీవల జీహెచ్‌ఎంసీలో జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తమ యూనియన్ ఆ తర్వాత జలమండలిలో, ప్రస్తుతం ప్రింటింగ్ ప్రెస్‌లో పోటీ చేస్తుందని వివరించారు.పాఠ్యపుస్తకాల ముద్రణాలయం అంటే తెలంగాణ చరిత్ర అని, దీన్ని కాపాడుకునేందుకు గతంలో ఎంతో మంది ఉద్యోగులు ఆత్మబలిదానా లు చేశారని వివరించారు. ఇపుడు అధికార టీఆర్‌ఎస్ ఈ ముద్రణాలయంలోని ఆధునిక యంత్రాలకు కనీస మరమ్మతులు కూడా చేయించకుండా పాఠ్యపుస్తకాల ముద్రణ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ను కార్మికులు సమిష్టిగా గెలిపిస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు బీఎంఎస్‌ను గెలిపిస్తే కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతు ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ప్రింటింగ్ ప్రెస్ విభాగం అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్, యూనియన్ నేతలు రాజేందర్, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి
వనస్థలిపురం, : ఎల్బీనగర్, ఎల్పీటీ మార్కెట్ ముందు ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఎల్పీటీ మార్కెట్ మర్చెంట్ కమిటీ అధ్యక్షులు రాపోలు రవి, కార్యదర్శి పీ.అశోక్ కోరారు. మార్కెట్ ముందు నిత్యం ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమైతున్న ప్రైవేటు బస్సులను ఇక్కడ నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జాతీయ రహదిరిపై ఆందోళన చేపట్టారు. అనంతరం మార్కెట్‌టో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ తమ మార్కెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఏర్పాటుచేసిన అనేక వస్తువుల కోసం దూర ప్రాంతాల నుండి కొనుగోలు దారులు పెద్ద ఎత్తున తరలి వస్తారని గుర్తు చేశారు. మార్కెట్‌లో ఏర్పాటుచేసిన దుకాణాల ద్వారా కొనుగోలు అమ్మకాల రూపం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కొన్ని రోజుల నుండి మార్కెట్ ముందు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ మార్కెట్‌లోకి కొనుగోలు దారులు రాకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు.
పోలీసుశాఖ నోపార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ దౌర్జన్యంగా వాహనాలు పార్కింగ్ చెస్తూ అడ్డు చెప్పిన వారిపై దాడులను పాల్పడుతున్నారని తెలిపారు. దసరా పండుగ సీజన్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయకుంటే మర్కెట్‌లో ఉన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతారని గుర్తుచేశారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ కోశాధికారి గోర్ల అశోక్, నామిని నర్సింహ, సంగిశెట్టి ప్రకాష్ పాల్గొన్నారు.