హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో టీఎన్జీఓ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీని వెంటనే అమలుచేసి, దసరా పండుగలోపు చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీఓ శుక్రవారం నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ధర్నా చేపట్టింది. టీఎన్జీఓ నగర అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో గంటసేపు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ 11వ పీఆర్‌సీని అమలు చేయటంతో పాటు ఉద్యోగులకు చెందిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకుని, ప్రభుత్వం పాత విధానానే్న అమలు చేయాలని కోరారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్‌కార్డును జారీ చేసి, ఆ కార్డు నగరంలోని అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే వారి స్వస్థలమైన తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులంతా కూడా తెలంగాణ ప్రజలేనన్న విషయాన్ని గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తామే కీలకమన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి, న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాలని ముజీబ్ కోరారు. ఈ ధర్నాలో టీఎన్జీఓ కార్యదర్శి టీ. ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎం.ఏ.ఖలీం, కార్యదర్శులు యాదీలాల్, మ క్బూల్, నాయకులు ప్రసన్న ఆనంద్, శ్రావణ్, జనార్దన్, వేణుమాధవ్, సరళ పాల్గొన్నారు.