హైదరాబాద్

ఉద్యమంలా ఇంకుడు గుంతల తవ్వకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రేపటి అవసరానికి కురిసే ప్రతి వాన నీటిబొట్టును ఒడిసి పట్టుకునేలా ఇంకుడు గుంతల తవ్వకాన్ని రంగారెడ్డి జిల్లాలో ఉద్యమంలా చేయుటకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి అంకుటిత నిర్ణయం తీసుకున్నారు. మే 5న జిల్లాలోని 688 గ్రామ పంచాయతీలలో ఒకే ముహూర్తానికి ఐదువేల ఇంకుడు గుంతలు తవ్వుటకు నిర్ణయించారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ కిందా 500 గ్రామ పంచాయతీలు, 188 పంచాయతీలలో జీపీ నిధులతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు సునీతారెడ్డి వెల్లడించారు. ఆ రోజున ఉదయం జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వార్డు సభ్యులు, ప్రజలు అందరు భాగస్వాములు కావాలని కోరారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు తీసుకున్న నిర్ణయానికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌లో సిఇఓ రమణారెడ్డి, డిపిఓ అరుణ, డ్వామ పీడీ అర్షిత, డిఆర్డీఎ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, గ్రామీణ తాగునీటి ఈఈ రమణలతో సమీక్షించారు. మే 5న చేపట్టబోయే ఈ ఉద్యమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనేలా చూడాలని సూచించారు.