హైదరాబాద్

ఆస్తమాపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: దీర్ఘకాలిక వ్యాధి ఆస్తమా పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఛాతి వైద్య నిపుణులు విజయ్‌కుమార్ అన్నారు. గురువారం పంజాగుట్టలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యులు సుదర్శన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్టు సర్వేల ద్వారా వెల్లడౌతున్నాయని చెప్పారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు కొంచం మెరుగ్గా అనిపించగానే ఇన్‌హేలర్స్ వాడటం మానేస్తున్నారని, దీంతో వ్యాధితీవ్రత పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానాలతో ఆస్తమా రోగులకు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నామని రోగుల్లో అవగాహన లేక పోవడంతో ఇబ్బందుల పాలౌతున్నారని చెప్పారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వ్యాధిపట్ల అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు.