హైదరాబాద్

రంగారెడ్డిపై హైదరాబాద్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న మహత్మాగాంధీ జూనియర్ స్టేట్ క్రికెట్ చాంపియన్‌షిప్ అండర్-16 లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జిల్లా జట్టు ప్రత్యర్థి రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 25 ఓవర్లలో 106 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన సీ.రాహుల్ రెడ్డి 32, ఆసద్ హుస్సేన్ 30 పరుగులు సాధించగా రంగారెడ్డి జిల్లా బౌలింగ్‌లో అన్ష్ నాయన్ గుప్తా, రిషీకేష్ గౌడ్‌లు చేరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జిల్లా జట్టు 25 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి ఓటమి పాలైంది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన అర్నావ్ రెడ్డి 52 పరుగులు చేశారు. హైదరాబాద్ జట్టు బౌలర్లు ఎన్.నిఖీల్ 15 పరుగులిచ్చి రెండు వికెట్లు, ఏవీ.శేషాంక్ రెడ్డి 22 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు.