హైదరాబాద్

పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించి, నేటికీ పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓలు శ్రీనివాస్‌రెడ్డి, రాజాగౌడ్ వివిధ శాఖలకు చెందిన విభాగాధిపతులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు ప్రజల నుంచి ఫిర్యాదులు, ఆర్జీలను స్వీకరించారు. ఇందులో భాగంగా అంబర్‌పేటకు చెందిన హాఫీజ్ సుల్తానా తన భర్త గులాన్ ముస్త్ఫా ఆకస్మికంగా మృతి చెందాడని, ఆ తర్వాత తనకెలాంటి ఆధారం లేకుండా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తున్నానని, తనకు వితంతు పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన ఆర్డీఓలు సంబంధిత తహశిల్దార్ ఫిర్యాదును పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. అంజద్ దౌలాలోని డా.బీ.ఆర్. అంబేద్కర్ అంధ, వికలాంగుల సంక్షేమ సంఘం, వికలాంగుల కాలనీకి చెందిన కొంత మంది కాలనీ వాసులు వికలాంగులకు సౌకర్యంగా ఏర్పాటు చేసిన స్థానిక రేషన్ షాపును వేరే ప్రాంతానికి మార్చినందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేస్తూ రేషన్‌షాపును పాత ప్రాంతానికి మార్చాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఇందుకు స్పందించిన ఆర్టీఓలు జిల్లా సివిల్ సప్లై ఆఫీసులు విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ భవనాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని షెడ్యూల్డు కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆర్డీఓలను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. ఇందుకు సంబంధించిన ఆర్డీఓలు స్థానిక తహశిల్దార్ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీఓలు మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, ఆన్‌లైన్‌లో నివేదికలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ రామభద్రం, ఎస్సీ కార్పొరేషన్ డీడీ మాన్యానాయక్, బీసీ వేల్పేర్ అధికారి విమల దేవీ, ఎల్జీఎం శ్రీనివాస్, ఏఓ అశోక్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.