హైదరాబాద్

ఆర్టీసీలో డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయ సంఘాల గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : ఆర్టీసీలోకి కొంత మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సంఘాల మధ్య చిచ్చుపెడుతోందని వివిధ సంఘాల నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిప్యుటేషన్ ఉత్తర్వులను తిరస్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కోరింది. ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను పావులుగా వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, ఇది దారుణమని యూటీఎఫ్ నేతలు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులను ఆర్టీసీకి డిప్యుటేషన్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని యూటీఎఫ్ ఖండిస్తోందని చెప్పారు. కాగా వేరొక ప్రకటనలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టీ నరసింహన్ సైతం సింగరేణి కార్మికులను ఆర్టీసీకి డిప్యుటేషన్‌పై పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కవ్వింపు చర్యలను మానుకోవాలని, లేకుంటే అన్ని సంఘాలూ ఉద్యమ బాట పడతాయని పేర్కొన్నారు.

ప్రయాణం..అదనపు భారం

* రాకపోకలు సాగించేందుకు
జనం ఇక్కట్లు
* రెండింతలు ఛార్జీలు
వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనాలు
* అవసరానికి తగినట్టు
అందుబాటులోని లేని ఆర్టీసీ బస్సులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: మహనగరవాసులపై ఆర్టీసీ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్మికులు సమ్మెకు దిగిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ప్రయాణికుల అవసరాలకు అనుకూలంగా బస్సులు అందుబాటులో లేవు. ఈ క్రమంలో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర పనులపై బయటకు వెళ్లాలనుకునే వారికి సిటీ ప్రయాణం ఆర్థికంగా అదనపు భారంగా మారింది. కొందరు తమ వ్యక్తిగత వాహానాలను వినియోగిస్తూ విధులకు హాజరవుతుండగా, ఐదు పదుల వయస్సులో ఉండి, రిటైర్డుమెంట్‌కు దగ్గర ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత వాహాలు, నడపలేక ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్ల రెట్టింపు ధరలను చెల్లించలేక ప్రైవేటు వాహానాలను ఆశ్రయిస్తున్నారు. అదే అదునుగా వారి నుంచి రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
శివార్లలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో పనిచేస్తున్న మరికొందరు ప్రతిరోజు రూ. 200 నుంచి రూ. 300 వరకు చెల్లించి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రకంగా చెల్లిస్తున్న ప్రైవేటు ఉద్యోగుల బాధ వర్ణణాతీతంగా ఉంది. నగరంలోని పలు ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను పెట్టి ఆర్టీసి అడపాదడపా ఆర్టీసి బస్సులను నడుపుతున్నా, కొన్ని బస్సులో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, మరికొన్ని బస్సుల్లో టికెట్ ఇవ్వటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు నడిపే ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఆపాలో కూడా వారికి తెలియకుండా ఇష్టమొచ్చిన చోట బస్సును ఆపి తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రతిరోజు వేల సంఖ్యలో బస్సులను నడుపుతూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి డ్రైవర్ల మాదిరిగా ప్రైవేటు డ్రైవర్లు విధులు నిర్వర్తించలేకపోతున్నారని ప్రయాణికులంటున్నారు. సచివాలయం నుంచి సికిందరాబాద్ స్టేషన్‌కు మామూలు రోజుల్లో ఆర్టీసి పది రూపాయల ఛార్జీ వసూలు చేయగా, ప్రైవేటు వాహనదారులు ఐరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాక, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నట్లు కొందరు ప్రయాణికులు వాపోయారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకపోవటంతో రాకపోకలు సాగించేందుకు తామెన్నో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోయారు.

మహిళ దారుణ హత్య
నల్లకుంట, అక్టోబర్ 11: భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్త హత్య చేసిన సంఘటన అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన వివరాలను అంబర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్ వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన అబ్దుల్ రషీద్(31), నౌషద బేగం(23)కి 2013లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్దుల్ రషీద్ ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఏడాది కాలంగా అంబర్‌పేట్ ఆజాద్ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సజావుగా సాగుతున్న సంసారంలో కొంత కాలంగా భార్య నౌషద బేగంపై భర్త అబ్దుల్ రషీద్ అనుమానం పెంచుకున్నాడు. భర్య మరోవ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడని స్థానికులు వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం భర్త అబ్దుల్ రషీద్ భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో తీవ్ర అవేశానికి గురైన రషీద్ గొడ్డలితో భర్యపై విచక్షణ రహితంగా దాడి చేసి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఇంటి యాజమాని సలీమ్ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమానికమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మండల ప్రణాళిక గణాంకాధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దిగువ స్థాయిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా విషయాన్ని గణాంక అధికారులు చక్కగా సేకరిస్తున్నారన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేయాలని కోరారు. ప్రభుత్వ ఆర్థిక సలహాదారు డాక్టర్ జీఆర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ధిక, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగా ఉందన్నారు. ఆర్థిక గణాంక శాఖ రూపొందించిన మాన్యువల్ ప్రతిని, గీతకార్మికుడు జీవితంపై జ్ఞాన రాజశేఖరన్ రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. పటేల్ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
సమాచారం ఇచ్చేదెవరు..?
వికారాబాద్, అక్టోబర్ 11: ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన సంబంధిత శాఖ అధికారి బోర్డుకు సంబంధించిన డిస్ ప్లే కనిపిస్తుంది. 2005 సమాచార హక్కు చట్టానికి సంబంధించి పౌర సమాచార అధికారి పేరు, సహాయ పౌర సమాచార అధికారి పేరు, అప్పిలేట్ అధికారి పేరు కనిపిస్తాయి. సమాచార నిమిత్తం వచ్చినవారు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో ఈ డిస్ ప్లే బోర్డు ఖాళీ పేర్లతో దర్శనమిస్తోంది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం ధరఖాస్తు చేసుకునే వారు సంబంధిత అధికారుల పేర్లు ప్రదర్శించకపోవడంతో ఎవరికి ఆర్జీ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ప్రజలకు సులభతరంగా సమాచారం తీసుకునేలా పేర్లను బోర్డుపై రాయాలని పలువురు కోరుతున్నారు.
చిరుత సంచారం
కులకచర్ల, అక్టోబర్ 11: కులకచర్ల మండల వాసులను చిరుత సంచారం భయభ్రాంతులకు గురి చేస్తుంది. గతంలో మండలంలోని అనంతసాగర్, కుసుమసంద్రం తదితర అటవీ ప్రాంతంలో చిరుత సంచరించేది. కానీ, శుక్రవారం తిరుమలపురం సమీపంలోని గండిచెరువు గుట్టల మీదుగా చిరుత సంచారించడంతో ఈ రహదారి వైపు వచ్చే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుట్టమీద స్పష్టంగా పులి కనిపించడంతో దూరం నుంచి అనేక మంది దాన్ని తమ ఫోన్లలో బంధించారు. రహదారికి కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ అది కాస్త కిందకు దిగితే ఇక కాళ్లకు బుద్ధి చెప్పడమే తరువాయిగా ఉంది. రాత్రివేళల్లో కూడా అనేక మంది ఈ రహదారిపై ప్రయాణాలు చేస్తుంటారు. పులి కంట్లో పడితే ఇక అంతే సంగతులని పలువురు వాపోతున్నారు. గతంలో అనేక సార్లు చిరుత సంచరించి అనంతసాగర్, కుసుమసంద్రం తదితర అడవుల్లోని పశువులను వేటాడి చంపేసింది. పొలాల దగ్గర కట్టేసిన పశులపై కూడా దాడులు చేసి సంహరించేది. ఈ విషయమై పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించినా వారుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాన్ని పట్టుకోవడంలో విఫలమైతున్నారని పలువురు వాపోతున్నారు.
షాబాద్‌లో భారీ వర్షం
షాబాద్, అక్టోబర్ 11: మండలంలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాలు మునిగిపోయాయి. కుమ్మరిగూడ, నాగర్‌కుంట, దైవాలగూడ, హైతాబాద్ గ్రామాల్లో ఎక్కువగా వర్షం పడడంతో చేతికి వచ్చిన పత్తి, మిరప, టమాట, వరి పంటలు నీటి మునిగి పోయాయని, పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

గచ్చిబౌలి, అక్టోబర్ 11: సంపన్నులు నివాసముండే ప్రాంతాలను గూగుల్ మ్యాప్‌లో శోధిస్తారు. ఎంచుకున్న కాలనీలోకి ఖరీదైన కారులో ప్రవేశించి విల్లా, ఫ్లాటునో కొనుగోలు చేయాడానికి వచ్చినట్లు కవరింగ్ ఇస్తు తాళం వేసిన ఇళ్లను చూస్తారు. కారులో నుండి కిందికి దిగిన నిముషాల వ్యవధిలో ఇల్లు గుల్ల చేసి అక్కడ నుండి ఉడాయించి మరో రాష్టన్రికి వెళ్లిపోతారు. నలుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ఘరాన దొంగల ముఠాను సైబరాబాద్‌లోని బాచుపల్లి, ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.35లక్ష విలువ చేసే బంగారం, వెండి ఆభరణలతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని బీబీ నగర్‌కు చెందిన ఆధిత్య కుమార్(34) రిషికేష్‌కి చెందిన మున్నిరాజు రాజుర(47) కోత్వాలీదేహత్‌కు చెందిన సురేందర్ కుమార్ (63) అదే ప్రాంతానికి చెందిన పంకజ్ చౌదరి(32) ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. గతంలో ఆదిత్య కుమార్ వాటర్ ప్లాంటు నిర్వహిస్తుండగా, మున్నిరాజు పాత నేరస్థుడని, సురేందర్ కుమార్ స్థిరాస్తి వ్యాపారం, పంకజ్ కుమార్ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. 2015 నుంచి దొంగతనాలు చేస్తున్నప్పటికీ ఎప్పుడు పోలీసులకు చిక్కలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత గ్రామాల్లో మర్యాదస్తులుగా నటిస్తారని చెప్పారు. ఖరీదైన కారులో సౌత్ ఇండియాలో దొంగతనాలకు బయలు దేరతాని నాలుగైదు రోజులు తిరిగి వచ్చిన మార్గంలోనే చోరీ చేసుకుంటూ వెళ్లిపోతారని వివరించారు. ఖరీదైన కారులో ఇళ్లను, ఫ్లాట్లను కొనుగోలు చేయనున్నట్లు వచ్చి తాళం వేసిన ఇళ్లను పరిశీలిస్తారు. ఆదిత్య, మున్నిరాజులు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో తాళాలు పగలగొట్టి కొద్ది నిముషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్లిపోతారని చెప్పారు. తెలంగాణలోని సంగారెడ్డిలో 1, కరీంనగర్‌లో 1, సైబరాబాద్‌లో ఐదు, ఏపీ, తమిళనాడులో 1, మధ్యప్రదేశ్‌లో ఒక కేసులో నిందితులని తెలిపారు. గడచిన నాలుగు సంవత్సరాలల్లో 10 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. నిందితులను మరోసారి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ.35 లక్షల విలువ చేసే 600 గ్రాముల బంగారం, రెండు కేజీలు వెండి ఆభరణాలతోపాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి బాచుపల్లి పోలీసులను ఎస్‌ఓటీ బృందాన్ని సీపీ అభినందించారు. సమావేశంలో క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, కుకట్‌పల్లి ఏసీపీ సురేందర్ రావు, బాచుపల్లి సీఐ జగదీశ్వర్ ఉన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.75 కోట్ల నిధులు
బాలాపూర్, అక్టోబర్ 11: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని 40 చెరువులను దాదాపు రూ.540 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. శుక్రవారం మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ సంధ చెరువు దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రా రెడ్డితో కలిసి రూ.23 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ట్రంక్ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ మహా నగరం పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 700 వందల చెరువులు ఉన్నాయని గుర్తుచేశారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వేల కోట్ల నిధులతో 20వేల చెరువులను ఎలా అభివృద్ధి చేసుకున్నామే, అదేవిధంగా పట్టణ ప్రాంతాల పరిధిలో గల చెరువులను కూడ అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని 40 చెరువులను రూ.540 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మధ్య నాల్లాలు, చెరువులో పుడిక తీస్తుంటే.. పరుపులు, చెద్దర్లు, ప్లాస్టిక్ బాటిల్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఇళ్లను ఎలా శుభ్రంగా ఉంచుకుంటామే, చెరువులు, నాల్లాలో చెత్త వేయకూండా అలానే చూసుకొవల్సిన బాధ్యత మనందరిపై ఉందని హితవు పలికారు. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని చెత్త బుట్టను పంపిణీ చేస్తే వాటిలో చాల మంది బియ్యం, పప్పులు వంటి సరుకులు పోసుకుంటున్నారని అన్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ ట్రంక్ లైన్ నిర్మాణంతో ప్రజలకు మురుగు వాసన, దోమల బెడద తప్పడంతో పాటు వర్షాలకు కాలనీలో నీళ్లు నిల్వడం వంటివి అనేక సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జేడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పీ.కార్తీక్ రెడ్డి, కందుకూరు ఆర్‌డీఓ రవీందర్ రెడ్డి, బాలాపూర్ తహశీల్దార్ చంద్రశేఖర్ గౌడ్, మీర్‌పేట్ కమిషనర్ కే.శ్రీహరి, మాజీ ఎంపీపీలు తీగల విక్రం రెడ్డి, జిల్లెల కృష్ణా రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, మాజీ జేడ్పీటీసీ జిల్లెల నరేందర్ రెడ్డి, సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్ల టీఆర్‌ఎస్ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్, మురుకుంట్ల అరవింద్ శర్మ, నాయకులు మనోహర్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి, సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

సాలూరి రాజేశ్వర రావు సేవలు
మరువలేనివి
కాచిగూడ, అక్టోబర్ 11: సంగీత సమ్రాట్ రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత డా.సాలూరి రాజేశ్వర రావు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు మరవలేనివని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. సాలూరి రాజేశ్వర రావు జయంతి సందర్భంగా ప్రముఖ లలిత సంగీత గాయకుడు డా.కే.రమాచారికి ‘సాలూరి ప్రతిభా’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం రసమయి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సముద్రాల వేణుగోపాల చారి పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా రాణించారని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వర రావు అని కిర్తించారు. మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ప్రముఖ గిటారు వాద్య నిపుణుడు సాలూరి పూర్ణచంద్ర రావు, కళారత్న అవార్డు గ్రహీత ఎంకే ఆర్ ఆశాలత, రసమయి అధినేత డా.ఎంకే రాము పాల్గొన్నారు.
దీపావళికి కానుకలు అందిస్తున్న
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
మెహిదీపట్నం, అక్టోబర్ 11: పదిహేను వేల రూపాయల విలువైన బంగారం లేదా వజ్రాల కొనుగోలుపై ఒక బంగారు నాణెం వినియోగదారులకు ఇవ్వనున్నట్లు మలబార్ గోల్డ్, డైమండ్స్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఆభరణాల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్, డైమండ్స్.. దీపావళి పండుగకు వెలుగులకు సరికొత్త జిలుగులు అద్దడానికి దేశంలోఅన్ని షోరూమ్‌ల్లో అక్టోబర్ 5 నుంచే బంగారు బహుమతులు, ప్రత్యేక తగ్గింపులను ప్రకటించిందని తెలిపారు. నవంబర్ 10వరకు ఆఫర్లు ఉంటాయని వెల్లడించారు.
త్యాగానికి నిదర్శనం
‘గుప్పెడంత గుండెలో..’
కాచిగూడ, అక్టోబర్ 11: త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ‘గుప్పెడంత గుండెలో..’ నాటకమని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి అన్నారు. సత్కళా భారతి 23వ వార్షికోత్సవం సందర్భంగా అభినయ ఆర్ట్స్ సమర్పణలో ‘గుప్పెడంత గుండెలో..’ నాటక ప్రదర్శన శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణుడు డా. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే ప్రధమ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సపై యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన నాటకమని వివరించారు. అంతరించిపోతున్న మానవీయ విలువలకు నీరాజనం నాటకమని పేర్కొన్నారు. నటి, నటులు ఎస్. రవీందర్ రెడ్డి, ఎ.లక్ష్మణ్ శాస్ర్తీ, పీవీ వీరయ్య, బండి రామకృష్ణ, వీసీ హెకే ప్రసాద్, ఎం.రాంబాబు, వెంకటేశ్, బీ.రామకృష్ణ, ఎస్‌ఎస్‌ఆర్‌సీ ప్రసాద్, లహరి, టీ.లక్ష్మీ ప్రదర్శించిన గుప్పెడంత గుండెలో నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు డా.ఎస్‌వీ సత్యనారాయణ, డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే, డా.ఎ.శ్రీనివాస కుమార్, డా.డీ.సీతారామ్, సత్కాళా భారతి అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.