హైదరాబాద్

మూక్ నాయక్ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయ సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ ప్రతిక స్ఫూర్తితోనే అంబేద్కర్ ఛానల్‌ను ప్రారంభించనున్నట్టు చైర్మన్ డాక్టర్ కే. శివ భాగ్యరావు అన్నారు. ఆదివారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో ఛానల్ డైరెక్టర్స్, అంబేద్కర్ మీడియా అవార్డు గ్రహీతలు, గౌరవ, పార్లమెంటరీ నియోజకవర్గ, ప్రాంతీయ డైరెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. 2020 నాటికి అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ పత్రిక వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఛానల్ ప్రారంభానికి సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. బౌద్ద ధర్మ దీక్షా భూమికి వెళ్లి అంబేద్కరియులను కలిసి మీడియా ప్రభావాన్ని వివరించి వచ్చిన భారత్ వాగ్మరే, ప్రసాద రావు, చంద్రకాంత్, ధరంపాల్ తదితర డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. సమావేశంలో డా.బీఎం వినోద్ కుమార్, అల్లాడి పున్నారావు, ఇనుగాల భీమారావు, ఆరెపల్లి రాజేందర్, డా.వెంకటేశ్వర్లు, ఇంద్రవెల్లి రమేష్, ముల్కల ప్రవీణ్, హజూర్ ఖలీద్, ఉపాశ్రీ అంజయ్య, డీవీలు పద్దజా, దేవదాస్, నాగరాజు పాల్గొన్నారు.
ఎర్ర ఉపాలికి ఘన నివాళి
ఇటీవల మృతి చెందిన బహుజన ఉద్యమ కవి, గాయకుడు ఉపాలికి ఘనంగా నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యువకులను ఉత్తేజపరిచిన ఉపాలి ఆకస్మిక మరణం.. బహుజన సమాజానికి తీరని లోటని అన్నారు. ప్రాథమిక విద్య కూడా లేకుండానే విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, యావత్ మేధావి వర్గాన్ని శాస్ర్తియ దృక్పదంతో ప్రశ్నించిన కవి ఉపాలి అని కొనియాడారు.