హైదరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి హనుమంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : బహుముఖ ప్రజ్ఞాశాలి సుద్దాల హనుమంతు అని తెలంగాణ ఎక్సెజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రముఖ చిత్ర దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తికి సుద్దాల ‘హనుమంతు-జానకమ్మ’ జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నారాయణ మూర్తికి జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. సుద్దాల హనుమంతు తెలంగాణ జాతి యావత్తుని తన గీతలతో మేల్కోపిన మహాకవి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎస్ ఎస్ తేజ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవి డా.కోయి కోటేశ్వర రావు, ప్రముఖ సంపాదకుడు కే.రామచంద్ర మూర్తి, తేజ ఆర్ట్ క్రియేషన్స్ అధ్యక్షుడు డా.పోతిరెడ్డి రంగయ్య, యువకళావాహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వర రావు, పార్థసారధి రెడ్డి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు.
అబ్దుల్ కలామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కాచిగూడ, అక్టోబర్ 13: భారతరత్న డా.అబ్దుల్ కలామ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శిఖరం ఆర్ట్ థియేటర్స్, కాచం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి వారికి ‘అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఎస్ రాములు పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. కాచం ఫౌండేషన్ చైర్మన్ కాచం సత్యనారాయణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ, వైఎస్‌ఆర్ మూర్తి, ప్రముఖ సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, నాట్య గురువు ఎస్‌పీ భారతి, సంస్థ అధ్యక్షుడు జీ.కృష్ణ పాల్గొన్నారు.