హైదరాబాద్

సఫాయి కర్మచారిల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో ప్రజలకు ముఖ్యమైన, కీలకమైన సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖలు సఫాయి కర్మచారిల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ మన్హల్ వాల్ద్భియ్ జాలా సూచించారు. నగరంలో మూడురోజుల పర్యటనలో భాగంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సఫాయి కర్మచారి సంఘాలతో కమిషన్ చైర్మన్, సభ్యులు జగదీశ్ హీరమణిలు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాల్ద్భియ్ జాలా మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో మ్యానువెల్ స్కావెంజింగ్ నిషేధం, ప్రత్యామ్నాయ పునరావాస చట్టం 2013 ఆధారంగా నిర్వహించిన సర్వేలో గుర్తించిన స్కావెంజర్లకు, వారి కుటుంబ సభ్యులకు పునరావాస కార్యఅకమాలను చేపట్టాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ పరికరాలను అందజేయటంతో పాటు కార్మికులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి సమస్యలను తెలుసుకునేందుకు జోనల్ కమిషనర్లు వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా కమిషనర్ వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో సీవరేజీ మ్యాన్‌హోళ్లలో జరిగిన ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు అందించిన పరిహారాలు, పునరావాస కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించరు.
నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న బడా కంపెనీలు, బహుళ జాతి సంస్థలకే సీఎస్‌ఆర కింద పారిశుద్ధ్యి సౌకర్యాలు కల్పించాలని, వారిని నగరంలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదివించేలా తగిన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. ఈ సమావేశంలో కమిషనర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి ఇన్‌ఛార్జి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ రవి, పోలీసు ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావు, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో పాటు అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.
చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం: కమిషనర్
నగరంలో మ్యానువెల్ స్కాంవెంజింగ్ నిషేధం, పునరావాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సమావేశంలో వెల్లడించారు.
స్కావెంజింగ్ వృత్తి నుంచి విముక్తి కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 25వేల 895 వ్యక్తిగత మరుగుదోడ్లను నిర్మించినట్లు తెలిపారు. దీంతో పాటు జీహెచ్‌ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్యి కార్మికులందరికీ రూ. 14వేల కనీస వేతనం అందజేయటంతో పాటు సఫాయి కర్మచారి సొసైటీలకు 9 ఇంజనీరింగ్ టాయిలెట్లు, మరో 66 పబ్లిక్ టాయిలెట్లును బీఓటీ ప్రాతిపదికన నిర్మించి, నిర్వాహణకు అందజేశామని తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 11లక్షలను అందజేయటం జరుగుతుందని వివరించారు. కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని నియమించామని కమిషనర్ కమిషన్ చైర్మన్‌కు వివరించారు.

పుబీసీల అభివృద్ధితోనే దేశ ప్రగతి
* తెలంగాణ బీసీ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వెల్లడి
ఖైరతాబాద్, అక్టోబర్ 14: దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని తెలంగాణ బీసీ డెవలప్‌మెంట్ అసోసియేషన్ పేర్కొంది.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోవ్వూరు భాస్కర్ రావు, కొండా దేవయ్య పటేల్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జానాభాలో అత్యధికంగా ఉన్న బీసీల్లో ఐక్యమత్యం కొరవడటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. వందకుపైగా ఉన్న బీసీ కులాల్లోని అనైక్యతే అభివృద్ధికి ఆటంకంగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని బీసీలందర్ని ఐక్యం చేసి సమస్యల కోసం పోరాడాలని నిర్ణయించినట్టు చెప్పారు. అసోసియేషన్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఈనెల 20న హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత సంస్థలో మంత్రి గంగుల కమలాకర్‌ను సన్మానించి, రాష్ట్రంలో బీసీ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవిస్తామని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కస్తూరి జయప్రకాష్, చింతల రాజేంద్ర ప్రసాద్, చిరుకలి శంకర్, సుదర్శన్ రావు, సత్యప్రసాద్ పాల్గొన్నారు.

బాధితుడికి రూ.7లక్షల చెక్కు అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 14: మహబూబ్‌నగర్‌లోని తిరుమల సినిమా థియోటర్‌లో సాహూ సినిమా విడుదల సందర్భంగా బ్యానర్ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆపన్న హస్తం అందించి ఆసరాగా నిలిచారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్. మంత్రి చొరవతో చిత్ర పంపిణీదారుడు, ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో మాట్లాడి వెంకటేష్ కుటుంబానికి రూ.7 లక్షల సాయంను అందించి ఆర్థికంగా తోడ్పాటునందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ తల్లి నీలమ్మకు మంత్రి చెక్‌ను అందించారు. కార్యక్రమంలో దిల్ రాజు, థియేటర్ యజమాని సురేష్ కుమార్ పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి
కాచిగూడ, అక్టోబర్ 14: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేదించాలని ప్రముఖ సామాజిక వేత్త లయన్ విజయ్ కుమార్ అన్నారు. తెలుగు వెలుగు కల్చరల్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ యుద్దానికి సిద్ధం’ అనే అంశంపై ‘కవి సమ్మేళనం’ సోమవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టిక్ వాడడంతో పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. కవి సమ్మేళనంలో కవులు తమ కవితలను వినిపించారు. టెలివిజన్ రచయితల సంఘం వైస్ ప్రెసిడెంట్ డా.వెనిగళ్ళ రాంబాబు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు శ్రీరామ్ దత్తి పాల్గొన్నారు.