హైదరాబాద్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతం..ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసి కార్మికుల సమ్మె మరింత ఉద్ధృతమైంది. సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండతా ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విఫలమవుతున్నాయి. మరో వైపు సమ్మె పదవ రోజైన సోమవారం ఆర్టీసి ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌తో పాటు అన్ని డిపోల ముందు చేపట్టిన ఆందోళనలు, నిరసనలతో నగరం అట్టుడికింది. ఆర్టీసి క్రాస్‌రోడ్డులోని బస్ భవన్‌ను ముట్ట్టంచేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు విచక్షణరహితంగా ఈడ్చుకెళ్లి, డీసీఎంలలో కుక్కుతూ అరెస్టులు చేశారు.
ఆత్మహత్యకు పాల్పడ్డ సురేందర్‌గౌడ్ మృతదేహాన్ని ఉంచిన కార్వాన్‌లో ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేదీ లేదని భీష్మించుకోవటంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. తాత్కాలిక డ్రైవర్లకు బస్సు డ్రైవింగ్‌పై సరైన నైపుణ్యత లేకపోవటం, కండక్టర్లు టికెట్లు జారీ చేయకపోవటం, బస్సు ప్రయాణించాల్సిన రూట్‌పై అవగాహన లేకపోవటం వంటి కారణాలను పక్కనబెడితే తాత్కాలికంగా నియమితులైన డ్రైవర్లు ఏకంగా మద్యం సేవించి బస్సులను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. కూకట్‌పల్లిలో ఆర్టీసి బస్సు నడుపుతూ ఓ తాత్కాలిక డ్రైవర్ ఆగి ఉన్న ఆర్టీసి బస్సును వెనకా నుంచి ఢీ కొట్టాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్టు గుర్తించి, అతనికి దేహశుద్ధి చేశారు. ఇదిలా ఉండగా, మరికొందరు డ్రైవర్ల పరిస్థితి మరింత విచిత్రంగా తయారైంది. డిపో నుంచి బస్సును బయటకు తీసిన తర్వాత ఎక్కడ, ఏ స్టాపులో నిలపాలో కూడా తెలియని వారిని నియమిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో మెహిదీపట్నం డిపో నుంచి నుంచి తాత్కాలిక డ్రైవర్లతో బయల్దేరిన నాలుగు బస్సులు హోటల్ మెరాజ్ నుంచి ఎడమవైపునకు మళ్లి, మెయిన్ బస్టాపుకు వెళ్లాల్సి ఉండగా, వన్ వే విధించిన హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లి, మళ్లీ రివర్స్‌లో వెనక్కి వచ్చాయి. ఫలితంగా కాసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
గడిచిన మూడు రోజులుగా రాష్టవ్య్రాప్తంగా ఇద్దరు కార్మికులు శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడగా, సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ బస్సు డిపో ముందు సందీప్ అనే మరో కార్మికుడు చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.