హైదరాబాద్

అల్ఫాసైఫర్ మిథేన్‌తో దోమల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో జీహెచ్‌ఎంసీ అధికారులను, ప్రజలను పరేషాన్ చేస్తున్న దోమల నివారణకు బల్దియా మరో ప్రయోగాన్ని చేయనుంది. ఇప్పటి వరకు పెరిత్రం స్ప్రే చేస్తున్న జీహెచ్‌ఎంసీ దీంతో దోమల సరిగ్గా చావటం లేదనే విషయాన్ని గ్రహించి ఇదివరకే ఆయిల్‌బాల్స్ ప్రయోగం కూడా చేసినా ఫలితం దక్కకపోవటంతో ఇపుడు ఆల్ఫాసైఫర్ మిథేన్ రసాయనాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ రసాయనం కలిపిన నీటిని విస్తృతంగా స్ప్రే చేయటంతో దోమలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. నగరంలోని అన్ని పాఠశాలలో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం స్ప్రే చేయటాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. స్ప్రేయింగ్‌తో నివాసాలు, పాఠశాల భవనాల గోడలపై ప్రత్యేక పొర ఏర్పడి, ఆ గోడలపై వాలిన దోమలు వెంటనే చనిపోతాయని వివరించారు. ఒక్కసారిగా ఈ మందును స్ప్రే చేస్తే 45 రోజుల పాటు ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రయోగంతో తక్కువ సమయంలో ఎక్కువ దోమల నివారించటంతో పాటు ఒక్కసారి స్ప్రే చేస్తే 45 రోజుల వరకు మళ్లీ అక్కడ దోమలు ఉత్పత్తి చెందకుండా ఉంటున్నందున అధికారులు ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రకంగా ఇప్పటి వరకు నగరంలోని 2443 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ ప్రయోగాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఒకవైపు దోమల నివారణ చర్యలను ముమ్మరం చేస్తూనే మరో వైపు దోమల నివారణ, దోమలు ఉత్పత్తి కాకుండా పాటించాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇప్పటి వరకు నగరంలోని 1361 పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులకు వైద్యాధికారులు, జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.