హైదరాబాద్

సాయి అఖండ ‘ఏకనామ సంకీర్తనాయజ్ఞ’ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : షిరిడి సాయి బాబా సమాది జరిగి 100 సంవత్సరాలు పూరి చేసుకున్న సందర్భంగా షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో 101 రోజుల పాటు ‘శ్రీసాయి అఖండ ఏకనామ సంకీర్తనాయజ్ఞ’ మహోత్సవం గురువారం ఆర్టీసీ ఓల్డ్ బస్‌భవన్‌లో ప్రారంభమైయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ పాల్గొని సాయి సంకీర్తనాయజ్ఞని ఘనంగా ప్రారంభించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాష్టోత్కరం, లలిత విష్ణు సహస్తన్రామ పారాయణం చేశారు. 101 రోజుల పాటు సాయి అఖండ ఏకనామ సంకీర్తనాయజ్ఞ మహోత్సవం సంకల్పించడం గొప్ప విషయమని లక్ష్మణ్ అన్నారు. సాయిబాబాకు రోజు ప్రత్యేక పూజలతో పాటు నిత్య అన్నదాన ప్రసాదం నిర్వహిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు శ్యామ్ సుందర్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో షిరిడి సాయి సేవా సమితి చైర్మెన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, మాగంటి కుమారమ్మ, మల్లికార్జున్, సుధాకర్ గుప్త, వెంకటేశ్, నర్సింగ్ రావు, రమేష్ రామ్, రవీందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, అక్టోబర్ 17: సప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ‘మధుర సినీ సంగీత’ విభావరి గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయనీ, గాయకులను సత్కరించి అభినందించారు. ప్రముఖ గాయకుడు మురళీధర్ నిర్వహణలో గాయనీ, గాయకులు మోహన్, గజపతి రాజు, వెంకట రమణ, రవీందర్, సుమశ్రీ, సుజాత, వసంత లక్ష్మీ, రమ అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్‌వీ రామరావు, రామణా రావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘యశోద కృష్ణ’
నృత్య రూపక ప్రదర్శన
కాచిగూడ, అక్టోబర్ 17: ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం జగన్నాథ శర్మ వర్థంతి సందర్భంగా ప్రముఖ నృత్య గురువు డా.మద్దాళి ఉషాగాయత్రి శిష్య బృందంచే ‘యశోద కృష్ణ’ కూచిపూడి నృత్య రూపక ప్రదర్శన నృత్య కినె్నర, కినె్నర ఆర్ట్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం పాల్గొని కళాకారులను అభినందించారు. వేదాంతం జగన్నాథ శర్మ అనేక మంది శిష్యలను తయారు చేశారని తెలిపారు. కళా రంగనికి ఆయన చేసిన సేవలను చిరస్మరణీయమని అన్నారు. ఉషారాణి శిష్యులు భానుజ, సాయి హర్షిణి, జే.లావణ్య, కే.్భనువైష్ణవి, జన్యశ్రీ ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
‘బేటి బచావో’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ
కాచిగూడ, అక్టోబర్ 17: పవిత్ర ఫౌండేషన్, టీం 3 సొల్యూషన్స్ సమర్పణలో ‘బేటి బచావో’ సినిమా పోస్టర్‌ను స్వామి పరిపూర్ణనంద గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. పవిత్ర ఫౌండేషన్ అధ్యక్షురాలు కే.గీతామూర్తి మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, భద్రత అంశలను దృష్టిలో పెట్టుకుని సందేశత్మక చిత్రాన్ని దర్శకుడు రవి దర్శకత్వంలో సినిమాను తెరకు ఎక్కిస్తున్నాట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను జారి చేసిందని తెలిపారు. ఈనెల ఆఖరి తేదీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లాప్‌తో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.