హైదరాబాద్

అస్తవ్యస్తంగా మారిన ప్రజారవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 13వ రోజుకు చేరుకుంది. సమ్మె ప్రారంభమైన పక్షం రోజులైనా నేటికీ ప్రజలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో విఫలమవుతూనే ఉంది. ఫలితంగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి విద్యా, ఉపాధి, ఉద్యోగం, ఇతర పనులపై రాకపోకలు సాగించాల్సిన నగరవాసులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతున్నామని ప్రభుత్వం ప్రకటించుకుంటున్నా, క్షేత్ర స్థాయిలో ప్రజల అవసరాలకు తగినన్నీ బస్సులు నడవకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆర్టీసీకి చెందిన అన్ని బస్సులు రాకపోకలు సాగించే సమయంలోనే అవసరానికి బస్సు రాకపోవడంతో బస్టాపుల్లో పడిగాపులు గాయల్సి ఉండేది, ఇపుడు సమ్మె కారణంగా ఒక్కో రూట్‌లో పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తుండటంతో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. మరికొన్ని రూట్లలో రాత్రి తొమ్మిది గంటలకు చివరి బస్సును నడపటంతో రెండోషిఫ్టుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులు తంటాలు పడుతున్నారు. బస్సు ఎక్కినా టికెట్ ఇవ్వకపోవటం, ఇప్పటి వరకు కొందరు తాత్కాలిక డ్రైవర్లు బస్సును ప్రమాదాలు చేయటం వంటి కారణాలతో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిన వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండగా, అదే అదునుగా వాహనాల యజమానులు రెట్టింపు ఛార్జీలు డిమాండ్ చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు.
సెలవులపై అయోమయం
ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులపై అయోమయం కొనసాగుతోంది. కొన్ని ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం ఆదేశాలకు విరుద్దంగా రహస్యంగా తరగతులను నిర్వహిస్తూ, ఏ రోజు కాలేజీకి రావాలి? ఎపుడు సెలవులు ప్రకటిస్తారో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. పాస్ గ్యారెంటెడ్‌గా ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు ఇచ్చిన పలు పేరుగాంచిన ప్రైవేటు కాలేజీలు సెలవుల విషయంలో ఏ రోజుకారోజు ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. రేపు కాలేజీ ఉందని, తరగతులు నిర్వహిస్తున్నామంటూ రాత్రిపూట మేసెజ్‌లు పంపుతూ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారు. పాఠశాలలకు ఈనెల 19వరకు ప్రకటించిన సెలవులను ఈ నెలాఖరు వరకు కొనసాగించినట్లు కూడా తప్పుడు ప్రచారం జరుగుతోంది.