హైదరాబాద్

టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని నగర తెలుగు తమ్ముళ్లు పీ.సాయిబాబా, నల్లెల్ల కిషోర్, ముప్పిడి మధుకర్ అన్నారు. హుజూర్‌నగర్‌లో ప్రచారం నిమిత్తం నగర టీడీపీ ఆఫీసు నుంచి బయల్దేరి వెళ్లారు. టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి వ్యవహారిస్తోందని అన్నారు. ఆర్టీసి కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ పక్షం రోజుల నుంచి సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదని వాపోయారు. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయటం వంటి పరిణామాలను గమనిస్తున్న ప్రజలు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తారని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీ సైతం రోడ్లకు మరమ్మతులను చేపట్టడంలో చేతులెత్తేసిందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో ప్రచారం నిర్వహించిన నేతల్లో రవీంద్రచారి, నాగూ నగేశ్, రాజాచౌదరి, విజయశ్రీ ఉన్నారు.

లిఫ్ట్‌లో ఇరుక్కొని బాలిక మృతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 18: ఎల్‌బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకుంది. అడుకుంటూ ప్రమాదవశాత్తూ లిఫ్టులో ఇరుక్కొని ఎనిమదేళ్ల బాలిక దుర్మరణం పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎల్‌బీనగర్ హస్తినాపురం పరిధిలోని పిండి పుల్లారెడ్డి కాలనీలో బార్యా పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అతని ఎనిదేళ్ల కూతుఠు లాస్య స్కూళ్లకు సెలవులు కావడంతో శుక్రవారం సాయంత్రం పొరుగింటి పిల్లలతో కలిసి ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. లాస్య లిఫ్ట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ తలుపులు మూసుకుపోవడంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. గుర్తించిన తల్లిదండ్రులు పరుగు పరుగున వచ్చి ఆమెను తీసుకొని వెంటనే అసుపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ఆ చిన్నారి మృతి చెందింది. లిఫ్ట్‌లో పడి ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోవడం పట్ల బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కొందరు భవన నిర్మాణ దారులు నాసిరకం లిఫ్ట్‌లు పెట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుత రావు ఆరోపించారు.

మేజిక్ కాజాకు
‘బెస్ట్ కాయినిస్ట్’ బిరుదు ప్రదానం
కాచిగూడ, అక్టోబర్ 18: ప్రముఖ మెజిషీయన్ మేజిక్ కాజాకు ‘బెస్ట్ కాయినిస్ట్’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం మేజిక్ ఫన్ స్కూల్, బుద్ధిరాజు ఎడ్యుకేషన్, సర్వీస్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిమిత్తం మేజిక్ కాజా గంటలో శూన్యం నుంచి వేయ్యి నాణేలను సృష్టించి రికార్డులో స్థానం సంపాధించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మైండ్ మెజీషియన్ డా.బీవీ పట్ట్భారామ్ పాల్గొని మేజిక్ కాజాకు బిరుదును ప్రదానం చేశారు. సీనియర్ మెజీషీయన్ డా. బీఎస్‌ఎస్ కుమార్ సభాధ్యక్షత వహించగా బాల సాహిత్య పరిషత్ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ, మెజిషీయన్ అలీ, వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, మేజిక్ ఫన్ స్కూల్ డైరెక్టర్ చొక్కాపు వెంటక రమణ, ఆనంద లహరి అధ్యక్షుడు కళారత్న మల్లం రమేష్, రఘుబాబు పాల్గొన్నారు.

అదృష్టం.. ఆనందం

ఉప్పల్, అక్టోబర్ 18: శుక్రవారం మేడ్చల్ జిల్లాలోని నాగోల్‌లో అనంతుల రాంరెడ్డి గార్డెన్‌లో 179 మద్యం షాపులకు దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ ఎంవీ రెడ్డి, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ డ్రా తీసి దుకాణాలను ఎంపిక చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన లక్కీ డ్రాతో అదృష్టం వరించి ఆనందాన్ని పంచగా మరికొందరిని పెట్టిన రెండు లక్షల డిపాజిట్ పోయిందని నిరాశ పరిచింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి ఈఎస్ పరిధిలో మొత్తం 181 షాపులు దుకాణాలు ఉండగా రెండు దుకాణాలకు దరఖాస్తులు తక్కువ వచ్చాయని డ్రా తీయడం వాయిదా వేశారు. మళ్లీ టెండర్లను పిలువాలని ఆదేశించారు. ఉన్న దుకాణాలకు 3344 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. సీరియల్ నెంబర్లు ఉన్న టోకెన్లను ఏర్పాటు చేసి బిందెలో వేసి డ్రా తీసి లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలను కేటాయించారు. డ్రాలో వచ్చిన పేర్లను దరఖాస్తుదారుల సమక్షంలో ప్రకటించారు. వచ్చే నెల 1నుంచి నూతన మద్యం పాలసీ అమలవుతుందని కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. 181కి 179 పిలిచిన టెండర్ల ద్వారా మద్యం దుకాణాలకు రెండేళ్లకు సుమారు రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీయడానికి ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ సూపరిండెంట్‌లు ప్రదీప్ రావు, గణేష్, ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులకు కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దూరంగా కూర్చున్న వారికి కన్పించేలా ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేసి టెండర్ల ప్రక్రియను ప్రశాంతంగా ముగించారు. డ్రాలో లక్కీగా దుకాణాలు దక్కుతాయనే ఆశతో వేలాది మంది, ముఖ్యంగా మహిళలు పాల్గొనడంతో ఫంక్షన్ హాల్ కిటకిటలాడింది. ఇదే అవకాశంగా భావించిన కొందరు తినుబండారు వ్యాపారులు వాటర్ బాటిల్, సమోస, భోజనాన్ని డబుల్ రేట్లను వసూలు చేయడం కొసమెరుపు.
లక్కున్నోళ్లు ‘46’ మంది
వికారాబాద్: అదృష్టంపైనే మద్యం వ్యాపారం ఆధారపడి ఉంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను సంబంధిత వ్యాపారులు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 46 మద్యం దుకాణాలకు 684 ధరఖాస్తులు వచ్చాయి. ఎక్సైజ్ శాఖకు రూ.13.68 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారుల ఆనందం అంతా ఇంతా కాదు. తాండూరు ఎక్సైజ్ పరిధిలో కే.ఆదిత్య కుమార్, నరేందర్ గౌడ్, పద్మారెడ్డి, చిట్లపల్లి శ్రీకాంత్ గౌడ్, మధుసుదన్ రెడ్డి, రాజుగౌడ్, కె.శ్రీనివాస్ గౌడ్, శోభదేవి, నాగ సురేశ్ గౌడ్, మన్‌సుక్ పటేల్, వడ్ల కృష్ణయ్య, ఎన్.శ్రీనివాస్, జే.వెంకటేశ్, ఎం.వెంకట్ రెడ్డి, మేగ్‌నాథ్ గౌడ్, కల్వ సంపత్ మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ పరిధిలో రఘువీరా రెడ్డి, బోడపాటి స్వప్న, చెగూరి నాగేష్ గౌడ్, కే.అవినాష్ రావు, కుర్వ సుధాకర్, జీ.సుధాకర్ రెడ్డి, వై.రఘుపతి రెడ్డి, టీ.వీరేందర్, సీ.శ్రీనివాసులు, గంగాధర్ గౌడ్, నర్సిములు గౌడ్ లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. మోమిన్‌పేట్ ఎక్సైజ్ పరిధిలో జీ.కృష్ణకుమార్, కే.దత్తాత్రి, పీ.సంతోష్ కుమార్, కే.పాండు, పీ.అంజప్ప దక్కించుకున్నారు. పరిగి ఎక్సైజ్ పరిధిలో ఏ.వెంకటేశ్ గౌడ్, కే.నరేశ్, కే.కృష్ణారెడ్డి, కే.మహేందర్ రెడ్డి, ముకుంద్ రెడ్డి, బీ.అనంత ప్రసాద్, ఎం.రాజేందర్, రాజు, పీ.రాంచంద్రయ్య మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. కోడంగల్ ఎక్సైజ్ పరిధిలో ఎం.రవికుమార్, జీ.రామ్మోహన్ రెడ్డి, డీ.సత్యనారాయణ, బీ.రాంరెడ్డి, కే.స్వప్న రెడ్డి లక్కీ డ్రాలో మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. ఎస్పీ ఎం.నారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ ఉన్నారు.

ట్రాన్స్‌కో అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

* వాడివేడిగా సాగిన మండల
సర్వసభ్య సమావేశం
కేశంపేట, అక్టోబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో ట్రాన్స్‌కో అధికారులు వ్యవహరించిన తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కేశంపేట ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ్ర
గామాలకు అవసరం ఉన్న మేరకు విద్యుత్ స్తంభాలు, వైర్లు సరఫరా చేయలేదని సర్పంచ్‌లు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణయ్య చెప్పారు. ట్రాన్స్‌కో అధికారులు స్పందిస్తూ గ్రామాలకు అవసరమైన విద్యుత్ స్తంభాలు, వైర్లు రాలేదని, వచ్చిన వెంటనే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వీఆర్‌ఏలు మండల రెవెన్యూ శాఖను పరిపాలిస్తున్నారని, ఏసీబీ అధికారులకు తహశీల్దార్ పట్టుబడి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఆ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని, తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ స్పందిస్తూ రెవెన్యూ శాఖ అధికారులు పనితీరు మార్చుకొని పనిచేయాలని, లేనిపక్షంలో మరోమారు ఏసీబీ దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. భగీరథ పథకం పనులు గ్రామాల్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదని, వాటన్నింటిని పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి, తుర్పుగడ్డతండ తండా సర్పంచ్ లలిత చెప్పారు. భగీరథ ఏఈ నాగమణి స్పందిస్తూ ట్యాంకుల నిర్మాణానికి సంబంధించిన భూమి తమకు చూపించలేదని, పనుల్లో జాప్యం నెలకొంటుందని, స్థలం చూపిస్తే త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. రైతులు కష్టపడి పండించిన పంటలను నేరుగా వ్యవసాయ మార్కెట్‌కు వచ్చి ధాన్యం విక్రయించుకొని, అప్పుడే ఆ రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రామకృష్ణారెడ్డి సభ్యులకు సూచించారు. జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్ రెడ్డి, ఇన్‌చార్జి తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ చంద్రకళ, డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీప్రసన్న, సర్పంచులు లక్ష్మమ్మ, జగన్, ఎంపీటీసీలు రమాదేవీ, యాదయ్య, రాజు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు
* ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వాగ్వివాదం
* పోలీసుల జోక్యంతో
సద్దుమనిగిన గొడవ
* రామంతాపూర్ డివిజన్
కమిటీ ఎన్నిక వాయిదా

ఉప్పల్, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఉప్పల్ సర్కిల్ పరిధిలో టీఆర్‌ఎస్ నేతల్లో విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే - కార్పొరేటర్ల మధ్య నెలకొన్న కోల్డ్‌వార్ బహిర్గతమైంది. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నూతన కమిటీలను నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉప్పల్, హబ్సిగూడ డివిజన్లలో కమిటీలను పూర్తి చేశారు. రెండు డివిజన్లలో ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న వారే అధ్యక్ష పదవిలో కూర్చున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇదే పరిస్థితి చిల్కానగర్ డివిజన్ కమిటీ సమావేశంలో నెలకొనే అవకాశం ఉన్న నేపధ్యంలో సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది. రామంతాపూర్ డివిజన్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం ఉన్న కుమార స్వామితో పాటు 11 మంది సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. అంతకు ముందు ఎవరిని నియమిస్తే బాగుంటుందని ఒక్కొక్కరి చొప్పున అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన ప్రసంగంలో గత ఎన్నికల్లో కార్పొరేటర్ తనకు అనుకూలంగా పని చేయలేదని చెప్పడంతో కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్, అతని అనుచరులు లేచి పని చేయకుండానే గెలిచారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక దశలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే మీదికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ నిలదీశారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమనిగింది. పార్టీ ఇన్‌చార్జి చంద్రశేఖర్ రెడ్డి కమిటీ ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.