హైదరాబాద్

కూలిన సరాయి భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసలే వర్షాకాలం..తరుచూ వర్షాలు కురుస్తున్నందున శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలతో అప్రమత్తంగా ఉండాలని, వాటిలో పటిష్టంగా లేని వాటిని తొలగించాలని ఇదివరకే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, క్షేత్ర స్థాయిలో అవి ఏ మాత్రం అమలు కాలేదని చెప్పవచ్చు. ఇందుకు శనివారం నాంపల్లి సమీపంలో సరాయి భవనం శనివారం సాయంత్రం సమయంలో కూలటం ఇందుకు నిదర్శనం. ఈ ఘటనలో గాయాలపాలైన ముగ్గుర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిన సమాచారం తెల్సుకుని రంగంలో దిగిన రెండు డిజాస్టర్ రెస్క్యు టీంలు సమయస్పూర్తి కారణంగా శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గుర్ని కాపాడటంతో ప్రాణ నష్టం జరగలేదు. మొత్తం 5828 చదరపుఅడుగుల విస్తీర్ణంలో 1919లో నిర్మించిన ఈ భవనాన్ని 2011లో హెరిటెజ్ భవనంగా ప్రకటించారు. ఇటీవల తరుచూ కురుస్తున్న వర్షాలకు బాగా నానిన ఈ భవనం శనివారం సాయంత్రం ఉన్నట్టుండి కూలింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అందులో ఉన్నట్లు స్థానికులు సమాచారమివ్వటంతో డీఆర్‌ఎఫ్ బృందాలు ముగ్గుర్ని కాపాడగిలిగాయి. ఈ సరాయి భవనం పక్కనే ఉన్న భవనాలు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవటంతో అవి కూలకుండా ఎంతో జాగ్రత్తగా జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో అర్దాకలితో ఉన్న వారికి మధ్యాహ్నం వేళలో రూ.5కే భోజనం అందించే స్కీంను మొట్టమొదటి సారిగా ఈ భవనంలోనే ప్రారంభించారు. నిజాం హయంలో ఈ భవనం నాంపల్లి రైల్వేస్టేషన్‌కు సదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సేద తీరేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యార్థంగా దీన్ని నిర్మించారు.