హైదరాబాద్

సీఆర్‌ఎంతో మెరుగైన నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని రోడ్లను మరింత మెరుగుగా నిర్వహించేందుకు వీలుగా బల్దియా రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. ప్రస్తుతం 709 కిలోమీటర్ల రోడ్డును ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను చేపట్టేలా మార్గదర్శకాలను రూపకల్పన చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు వెల్లడించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్(సీఆర్‌ఎం) అనే సరికొత్త విధానంతో నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రోడ్ల నిర్వహణ బాధ్యతలను చేపట్టే ప్రైవేటు సంస్థలు ఐదు సంవత్సరాల పాటు రోడ్లపై ఏర్పడే గుంతలను, తవ్వకాలకు మరమ్మతులను ఏజెన్సీ చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఇకపై ఫుట్‌పాత్‌లను తవ్వాలంటే ఆరు నెలల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం గుంతల పూడ్చివేత, నూతన రోడ్ల లేయర్ల నిర్మాణం వంటి పనులకు వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన ప్రమాణాల మేరకు రోడ్ల నిర్వహణను చేపట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారు. నూతనంగా రోడ్లు వేయటం, మీడియన్ల గ్రీనరీ, రోడ్ల క్లీనింగ్, ఫుట్‌పాత్ నిర్మాణం విస్తరణ వంటి అవసరాలకు రోడ్లు తవ్వేందుకు వర్కింగ్ ఏజెన్సీలే సహకరించనున్నట్లు తెలిపారు. ఆయా సంస్థలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం ఆరు నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. దీంతో కొత్తగా వేసిన రోడ్లు, ఫుట్‌పాత్‌లను వెంటనే తవ్వే అవసరం ఉండదని ఆయన వివరించారు. ఫలితంగా రోడ్ల మరమ్మతులు వంటి విషయాలకు సంబంధించి ఇప్పటి వరకు వివిధ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం వంటి సమస్య ఉండబోదని అన్నారు. సంస్థలు ఐదేళ్ల పాటు ఉంటున్నందున, అవి వేసే రోడ్లు దీర్ఘకాలం మనే్నలా నిర్మించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వెల్లడించారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులకు పాల్గొన్నారు.
709కి.మీ.లు..ఏడు యూనిట్లు
కాంప్రహెన్సీవ్ రోడ్డు మెయింటనెన్స్ కార్యక్రమం కింద 709 కిలోమీటర్ల రోడ్డును ఏడు యూనిట్లుగా విభజించి దీర్ఘకాలిక టెండర్లను జీహెచ్‌ఎంసీ ఆహ్వానించనుంది. ఏజెన్సీలు చేపట్టే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంతో రోడ్ల నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లు తొలగిపోతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.