హైదరాబాద్

ఆక్రమణలపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నాలాలపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ శంకర్‌యాదవ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి నాలాను పరిశీలించారు. కొందరు నాలాను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కారణంగా వర్షాలు కురిసినపుడు నాలా పొంగి సమీప నివాసాలు ముంపునకు గురవుతున్నామని కొందరు స్థానికులు మంత్రికి విన్నవించారు. దీంతో పాటు నాలాలోని పూడకను పూర్తి స్థాయిలో తొలగించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని స్థానికులు కోరటంతో ఈ మేరకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన గోషామహల్ నియోజకవర్గం స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్శనలో మేయర్ బొంతు రామ్మోహన్, జోనల్ కమిషనర్ ముషారఫ్, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీ్ధర్‌తో పాటు ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు.