హైదరాబాద్

విద్యార్థుల బస్‌పాస్‌లను అనుమతించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని కోర్టు హోల్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభం అయినందున ఆర్టీసీ బస్సుల్లో పాసులను అనుమతించాలని ఆదేశించారు. సమ్మె వల్ల సాదారణ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు అన్ని బస్ సర్వీసులను నడుపుతున్నట్టు చెప్పారు. విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాని సూచించారు. బస్సుల్లో టికెట్లను తప్పని సరిగా ఇవ్వాలని ఆదేశించారు. టికెట్ యంత్రాలపై తాత్కాలిక కండక్టర్లకు శిక్షణ ఇప్పించాలని, సాంకేతిక సమస్యలు ఉంటే ముద్రించిన టికెట్లును ఉపయోగించాలని అన్నారు.
బస్సుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడితే తక్షణమే సరిచేసుకునేలా స్థానిక మెకానిక్‌లను కలెక్టర్ ఆదేశం మేరకు నియమించుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, 17 రోజులుగా సమ్మె ఉన్నా ప్రజలకు ఇబ్బందులు కలకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా బస్సులను నడుపుతుందని చెప్పారు. సమావేశంలో కమిషన్ సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరీష్ పోలీస్ పాల్గొన్నారు.