హైదరాబాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లాలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్ది వెల్లడించారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలను, మద్దతు ధరలను తెలియజేసే వాల్ పోస్టర్ ను విడుదల జేశారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని తొందరపడి దళారీలకు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధర అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. గ్రేడ్ ‘ఎ’ ధాన్యానికి రూ.1835, కామన్ గ్రేడ్‌కు రూ.1815 మద్దతు ధరగా నిర్ణయించనట్లు మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించే రైతులకు రెండురోజుల్లోగా వారి అకౌంట్లలో డబ్బులను జమచేస్తామని మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, ప్రకాశ్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు.