హైదరాబాద్

అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై తీర్పు వెలువరించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిద్ధమైంది. శనివారం తుది తీర్పు వెలువడనున్న నేపథంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇదివరకే అప్రమత్తం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి నగర పోలీసులు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్ పిలుపు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నగర పోలీసులు ట్యాంక్‌బండ్ చుట్టు ప్రక్కల ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకుని భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉండగా శనివారం అయోధ్యపై తీర్పు వెలవడనున్న నేపథ్యంలో నగంలో గొడవల జరుగవచ్చని భావించి ముందు జాగ్రత చర్యగా పాతబస్తీ దక్షిణ మండలంతో పాటు నగరంలోని వివిధ సమస్యత్మక ప్రాంతాలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ట్యాంక్‌బండ్‌వైపు ఉన్న రోడ్లను మూసి వేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. నగరంలో పోలీసులు రౌండ్‌ది క్లాక్ విధులు నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశారు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ నగర పోలీసులకు ఒక వైపు అయోధ్య తీర్పు, మరో వైపు చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం సవాల్‌గా మారింది.

రసాయన బాక్స్ పేలి మహిళకు గాయాలు
బాలాపూర్, నవంబర్ 8: చెత్తకుప్పలో దొరికిన బాక్స్‌ను తెరవటానికి ప్రయత్నించిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించి మహిళకు గాయాలయ్యాయి. మీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి కాలనీకి చెందిన ముగ్గురు మహిళలు చెత్త ఏరుకుంటున్నారు. విజయపురి కాలనీలో నిర్మలకు ప్లాస్టిక్ బాక్స్ దొరకడంతో దానిని రోడ్డుపై గట్టిగా పగులగొట్టడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించి గాయాలపాలయింది. మహిళలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ డాగ్స్, క్లూస్ టీం, బాంబ్ స్కాడ్‌తో తనిఖీలు చేపట్టామని, పేలిన బాక్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీ సురేంద్రబాబు, ఏసీపీ శంకర్, ఇన్‌చార్జి సీఐ శివశంకర్ పాల్గొన్నారు.