హైదరాబాద్

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వివిధ విభాగాధిపతులు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జి.రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి ఆర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భాగంగా దోమల్‌గూడకు చెందిన జి. విజయలక్ష్మి తన భర్త రామశాస్ర్తీ అకస్మాత్తుగా మృతి చెందారని, తాను, తన కుమార్తె ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, తమకు ఏ ఆధారం లేనందున వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దూల్‌పేటకు చెందిన విద్యావతి తన భర్త మల్లికార్జున్ చనిపోయాడని, తనకు సైతం ఎలాంటి ఆధారం లేనందున పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జేసీకి వినతిపత్రం సమర్పించారు. సంబంధిత తహశిల్దార్లు వెంటనే స్పందించి దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జేసీ ఆదేశించారు. పాతబస్తీ లాల్‌దర్వాజకు చెందిన మంజులత తన భర్త శ్రీనివాసు మృతి చెందాడని, తనకు ఫ్యామిలీ బెనిఫిట్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. దరఖాస్తును పరిశీలించాలని బండ్లగూడ తహశిల్దార్‌ను జేసీ ఆదేశించారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన రజాక్ మోఘల్‌కా నాలా ప్రాంతంలో కొంత మంది అక్రమంగా బోర్డు వేసి నీళ్లు అమ్ముతున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆసిఫ్‌నగర్ తహశిల్దార్ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సోమవారం నాటి ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉపాధి, రుణాలు, పెన్షన్లు, ఇళ్ల కోసం వినతిపత్రాలు సమర్పించినట్లు జేసీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు శ్రీనివాస్‌రెడ్డి, రాజాగౌడ్‌లతో పాటు సీపీఓ రామభద్రం, బీసీ వేల్ఫేర్ అధికారి విమలాదేవి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ నిర్మలా ప్రభావతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామారావు, ఎస్సీ కార్పొరేషన్ డీడీ మాన్యానాయక్, వికలాంగుల సంక్షేమాధికారి పుష్పలత ఎల్జీఎం శ్రీనివాస్, ఏఓ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.