హైదరాబాద్

రైళ్ల ఢీతో భయం..భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కాచిగూడ: కొందరు విద్యా, మరికొందరు ఉపాధి,
ఇంకొందరు ఇతరత్రా పనులపై
ఎక్కిన రైలు కదలటం ప్రారంభ
మైంది. మరికొద్ది క్షణాల్లో
గమ్యస్థానం చేరుకుంటామన్న
ధీమాతో కొందరు సెల్‌ఫోన్లలో
బిజీగా ఉండగా, మరికొందరు
హాయిగా ఒకరికొకరు కబుర్లు
చెప్పుకుంటున్నారు.
ఉన్నట్టుండి ఒక్క
సారిగా ఓ కదుపు. పెద్ద శబ్దం
రావటంతో అసలేం జరిగిందోనన్న
ఆందోళన. క్షణాల్లో షాక్ నుంచి మేల్కొని గమనిస్తే కొందరు సీట్లకు
తలలు కొట్టుకుని రక్తస్రావం
జరగగా, మరికొందరు ఎగిరి కొంత
దూరం పడ్డారు. ఎందుకిలా
జరిగిందన్న విషయాన్ని
పరిశీలించగా, కాచిగూడ స్టేషన్
నుంచి బయల్దేరిన ఎంఎంటీఎస్
రైల్ అదే ట్రాక్‌పై ముందుగా
ఆగి ఉన్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో
పదుల సంఖ్యలో ప్రయాణికులు
గాయాలపాలయ్యారు. లోకోపైలట్
ఇంజన్ క్యాబిన్‌లో
చిక్కుకుపోవటంతో ఆయనను
బయటకు తీసేందుకు డీఆర్‌ఎఫ్,
రైల్వే బృందాలు ఎనిమిది గంటల
పాటు రెస్క్యూ ఆపరేషన్
నిర్వహించి, ఎట్టకేలకు క్షేమంగా
బయటకు తీశారు.

డీఆర్‌ఎఫ్ చేయూత

హైదరాబాద్, నవంబర్ 11: కాచిగూడలో ఇంటర్‌సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొట్టిన ఘటన జరిగిన వెంటనే జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్సు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోంది.
ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన లోకోపైలట్ శేఖర్‌ను రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్సు, రైల్వే సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన 50 మంది సిబ్బందితో కూడిన మూడు డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో చిక్కుకుపోయిన లోకోపైలట్‌ను బయటకు తీసేందుకు చేపట్టిన ఎనిమిది గంటల రెస్క్యూ ఆపరేషన్‌లో డీఆర్‌ఎఫ్ కీలక పాత్ర పోషించిందనే చెప్పవచ్చు. పైగా జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలకు సమకూర్చిన గ్యాస్ కట్టర్లు వంటి పరికరాలతోనే కూల్ గ్యాస్ కట్టింగ్ చేపట్టి, ఎట్టకేలకు ఎనిమిది గంటల తర్వాత శేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. తొలుత రైలు నుంచి బయటకు తీసిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం త్వరితగతిన ఆసుపత్రులకు తరలించటంలోనూ డీఆర్‌ఎఫ్ ఎంతో కీలకమైన పాత్ర పోషించింది.