హైదరాబాద్

అంతా మా ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని రోడ్డు సైడును నమ్ముకుని చిన్నచితకా వ్యాపారాలు చేసుకుని జీవించే వారు బల్దియా అధికారులు విధిస్తున్న స్వచ్ఛ జరిమానాలతో బేజారవుతున్నారు.
నగరంలో రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం వేయటం, బహిరంగ మూత్ర విసర్జన చేయటం, వ్యాపార సంస్థ ఆవరణను అపరిశుభ్రంగా ఉంచటం వంటి ఇతరత్ర కారణాలతో మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం తాము ఎంతైన జరిమానా విధించవచ్చునని జీహెచ్‌ఎంసీ అధికారులు వన్‌పాయింట్ ప్రొగ్రాంగా ప్రతిరోజు వసూళ్లకే పరిమితమవుతున్నారు. మరో వైపు జీహెచ్‌ఎంసీ ఖజానా ఖాళీ కావటంతో అందుబాటులో ఉన్న ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుని నిధులను సమీకరించుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీలోని హెల్త్, శానిటేషన్ విభాగంలోని శానిటరీ సూపర్‌వైజర్ మొదలుకుని, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ కమిషనర్లు, చివరకు టౌన్‌ప్లానింగ్‌లోని సెక్షన్ ఆఫీసర్లు, చైన్‌మెన్‌ల వరకు ఎక్కడికక్కడ జరిమానాల వసూళ్లపై టార్గెట్లు విధించారు. నిధుల సమీకరణతో పాటు నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడే వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు కొందరు అక్రమార్కులైన అధికారుల అక్రమ సంపాదనకు అవకాశంగా మారింది. దీంతో పాటు జరిమానాలు విధించటంలోనూ అధికారులు వివక్ష కనబరుస్తున్నారన్న వాదన సైతం లేకపోలేదు.
కొద్దిరోజుల క్రితం చందానగర్ సర్కిల్‌లో ఒక వర్గం వారు నిర్వహించిన మతపరమైన కార్యక్రమంతో చెత్తాచెదారం పేరుకుపోయిందంటూ ఓ డిప్యూటీ కమిషనర్ ఏకంగా రూ.పది లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే! నగరం నడిబొడ్డున ఉన్న ఆబిడ్స్ సర్కిల్‌లో నిత్యం రద్ధీగా ఉండే ఓ ప్రాంతంలో నిప్పులపై జొన్న కంకులు కాల్చుకుని జీవించే చిరువ్యాపారి స్వచ్ఛ ఉల్లంఘనకు పాల్పడ్డాడంటూ రూ.వెయ్యి జరిమానా విధించినట్లు తెలిసింది. తన రోజువారీ సంపాదనే వెయ్యి దాటని పరిస్థితుల్లో తాను వెయ్యి రూపాయల జరిమానా చెల్లించేదెలా అంటూ చిరువ్యాపారి లబోదిబోమంటున్నారు.
జీహెచ్‌ఎంసీకి ఎంత జరిమానా విధించాలి
రోడ్లపై చెత్తాచెదారం పారవేసినా, నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ ప్యాకెట్లు వేసినా, నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, వ్యాపార సంస్థల ఆవరణ పరిశుభ్రంగా లేకపోయినా వ్యాపారులు, సామాన్యులకు భారీగా జరిమానాలు విధించే జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నేటికీ వీఐపీ జోన్‌తోపాటు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా దర్శనమిస్తోంది. ఇళ్ల నుంచి స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరించిన చెత్తను నిల్వ చేసే ట్రాన్స్‌ఫర్ స్టేషనన్లలోని చెత్తను సకాలంలో తరలించకపోవటం, వాటి చుట్టున్న జనవాసాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రకంగా టన్నుల కొద్దీ చెత్తను ఒక చోట నిల్వ ఉంచటం, సకాలంలో తొలగించకపోవటం పట్ల బల్దియాకు ఎంత జరిమానా విధించాలోనంటూ కొందరు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.