హైదరాబాద్

నగరానికి కార్తీక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సకల లోకాలకే ఈశ్వరుడైన శివుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టమని, ఈ మాసంలో శివుడికి పూజలు చేసేవారికి శుభం కల్గుతుందన్న నమ్మకం. కార్తీకమాసం రెండో సోమవారం రోజున కూడా నగరంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. కొందరు శ్రీ సత్యనారాయణస్వామి కథ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవటంతో భాగ్యనగరం కార్తీక మాసం శోభ సంతరించుకుంది. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అంతేగాక, కొంతగా ఇంటిని నిర్మించుకున్న వారు సైతం ఈ మాసంలో గృహాప్రవేశం చేసుకునేందుకు, మరికొందరు భూమి, నూతన గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కార్తీకపౌర్ణమి మంగళవారం రావటంతో చాలా మంది అమ్మవారిని, శివుడి పూజలు కలిపి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్తీకపౌర్ణమి ఎంతో పవిత్రంగా భావిస్తుండటంతో పలు శుభకార్యాలకు సంబంధించి మంగళవారం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

హైదరాబాద్, నవంబర్ 11: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి ఉషారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్‌రెడ్డితో కలిసి డీఆర్‌ఓ స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ప్రజావాణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జేఎన్‌ఎన్‌యూఆర్ ఇళ్ల కేటాయింపులు, పెన్షన్‌లు, భూ సమస్యలు, రుణ మంజూరు, రుణమాఫీ, ఆహార భద్రత కార్డు తదితర అంశాల పై 41 ఫిర్యాదులు వచ్చాయి.