హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎటు చూసినా భక్తిప్రపత్తులతో పూజలు, వ్రతాలు, దేవాలయాల ఆవరణలు శివనామస్మరణతో మారుమోగాయి. మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నగరవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస శోభను సంతరించుకున్న నగరంలో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. నగరంలోని ప్రతి దేవాలయంలో భక్తుల రద్దీ కన్పించగా, శివాలయాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. పలు శివాలయాల్లో తెల్లవారుఝము నుంచే భక్తుల సందడి నెలకొంది. పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించటంతో పాటు శివజపం వంటివి నిర్వహించారు. అంబర్‌పేటలోని శివం ఆలయం, శివారులోని కీసర దేవాలయంతో పాటు చిల్కూరు బాలాజీ దేవాలయంతో పాటు పాతబస్తీలోని శ్రీ్భగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాల వద్ధ భక్తుల దర్శనం కోసం క్యూ కట్టారు. చార్మినార్ సమీపంలోని ఈ ఆలయం వద్ధ పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దీనికి తోడు మరోవైపు ఇటీవలే అయోధ్య కేసు తీర్పు రావటంతో పాతబస్తీలోని పలు దేవాలయాల వద్ద, సున్నిత ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని నగరవాసులు స్థానిక దేవాలయాల్లోనే శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించటం, మరికొందరు ఇళ్లలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానాలు చేశారు. మరికొందరు భక్తుల సిరిసిల్ల శ్రీరాజన్న, శ్రీశైల మల్లికార్జున స్వామి, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దర్శనార్థం సోమవారం రాత్రే పయనమయ్యారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజాసామాగ్రి పూలు, పండ్లు, అరిటాకులు, పత్తి ఇతరత్ర సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటాయి.
కోటి దీపోత్సవానికి తరలిన భక్తజనం
ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియంలో పక్షం రోజుల పాటు నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినం కావటంతో భక్తులు కిక్కిరిశారు. ప్రారంభమైన నాటి నుంచి రోజు వచ్చిన భక్తుల సంఖ్య మంగళవారం రెట్టింపయింది. కార్తీక పున్నమి వెనె్నల్లో మహాదేవుని మహోత్సవం, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం, పున్నమి సందర్భంగా జ్వాలాతోరణం, కోటి దీపాల కాంతుల్లో స్వర్ణలింగోద్భవం, కోటి రుద్రాక్షాల అర్చనలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆధ్యాత్మిక వేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనం చేయగా, శ్రీకాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య ఆశీర్వచనం పలకగా, శ్రీహల్దీపురం శ్రీవామనాశ్రమ స్వామి అనుగ్రహభాషణం గావించారు. భక్తుల శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం దద్దరిల్లింది.
కీసర: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జన సందోహంతో కిటకిటలాడింది. ఉదయం 4 గంటల నుంచే నగర నలుమూలల నుంచి భక్తులు కీసరగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాలలో కార్తీక దీపాలు వెలిగించి, ఆలయ పరిసరాల్లోని శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి తమ మొక్కలు తీర్చుకున్నారు. గుట్ట దిగువ భాగాన పార్కులో, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాలు చేశారు. ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో సొంత వాహనాల్లోనే భక్తులు కీసరగుట్టకు రావటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. వేద పండితులు శ్రీరామలింగేశ్వర స్వామివారికి భస్మాభిషేకం, మహాలింగ దీపోత్సవం, జ్వాలా తోరణం వంటి పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ టీ.నారాయణ శర్మ, ఈఒ సుధాకర్ రెడ్డి, ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు.