హైదరాబాద్

ఇంకెన్నాళ్లీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని ఆర్టీసీ కార్మికులు..కార్మికులు చేస్తున్నది సమ్మె అక్రమం అంటూ ప్రభుత్వం..ఇలా ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నలభై రోజులు గడిచాయి. పట్టువీడని కార్మికులు, మెట్టుదిగని ప్రభుత్వం కారణంగా సామాన్యులు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారు. దసరా పండుగకు ముందు నుంచి ఆర్టీసి కార్మికులు సమ్మెబాట పట్టడటంతో అప్పటి నుంచి నేటి వరకు నగరంలో ప్రయాణం నరకంగా మారింది. ఆర్టీసీ సమ్మెలో రోజూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై మహానగరవాసులు కూడా ఎప్పటికపుడు ఆసక్తితో గమనిస్తున్నారు. మహానగరంలోని కోటి 30లక్షల మంది జనాభాలో అత్యధిక శాతం మంది విద్యా, ఉద్యోగం, ఉపాధి తదితర పనులపై ఎక్కువగా ఆర్టీసీ బస్సులోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభం కాకముందు కేవలం రూ.15 టికెట్ చెల్లిస్తే సుమారు పది నుంచి పదకొండు కిలోమీటర్ల దూరం ప్రయాణికులు ప్రయాణించే వారు. కానీ కార్మికులు సమ్మెకు వెళ్లిన తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తాత్కాలిక డ్రైవర్లకు రూ.1500, తాత్కాలిక కండక్టర్లకు రూ.వెయ్యి రోజువారీ వేతనంగా చెల్లించినా, ప్రయాణికుల అవసరాలు తీరటం లేదు. పగలు అంతంతమాత్రంగా రాకపోకలు సాగించే బస్సులు రాత్రి ఎనిమిది గంటలు గడిచిన తర్వాత అసలు అందుబాటులో ఉండటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదే అదునుగా ఆటోవాలాలు, ప్రైవేటు వాహనదారులు ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.