హైదరాబాద్

ఫ్లెక్సీల ఏర్పాటుపై పార్టీ శ్రేణులపై కేటీఆర్ సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు పార్టీ శ్రేణులపై సీరియస్ అయ్యారు. చిత్తారమ్మనగర్ బస్తీలో 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లును, అయ్యప్ప సొసైటీ గాయత్రినగర్‌లో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవానికి, మరో రెండు పనులకు శంకుస్థాపన చేసేందుకు హాజరైన మంత్రి కేటీఆర్ అక్కడ టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా, మీలో మార్పు రాదా? ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నా, నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం ఉన్నా, ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? గతంలో జరిమానాలు విధించిన సంగతి తెలియదా? అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పలువురు స్థానిక నేతలపై మండిపడ్డారు. వాటిని తొలగిస్తేనే కార్యక్రమానికి హాజరవుతానని తేల్చి చెప్పటంతో రంగంలో దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్పటికపుడు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. మరోసారి ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే తాను కార్యక్రమాలకు హాజరుకానని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. చిత్తారమ్మనగర్‌లో నూతనంగా నిర్మించిన 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ పాలు పొంగించి, సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈ కాలనీవాసులు మంత్రికి బతుకమ్మలు, బోనాలు నిర్వహించి, బాణాసంచా పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కృష్ణారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ లోకేశ్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు.
రూ.6.51 కోట్లతో ఇండోర్ స్టేడియం
అయ్యప్ప సొసైటీ గాయత్రినగర్‌లో రూ.86లక్షలు, ఫేస్-6లో రూ.5.65 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు ఇండోర్ స్టేడియాలను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్టేడియాల్లో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టులు, కేఫ్‌టేరియా, కరాటే తదితర క్రీడలను ఔత్సాహికులకు అందుబాటులోకి తెచ్చారు.
మత్స్యకారులకు మాడ్రన్ ఫిష్ మార్కెట్
వెయ్యి 651 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు రూ. 2.78 కోట్ల వ్యయంతో మత్సకారుల కోసం నిర్మించిన మాడ్రన్ ఫిష్ మార్కెట్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ రూ. 2.25 కోట్లు అందించగా, జీహెచ్‌ఎంసీ తన వాటా కింద రూ. 53.20లక్షలు కేటాయించింది. మొత్తం 81 స్టాల్స్‌తో పాటు రెండు హోల్‌సేల్ స్టాళ్లు, ఆరు డ్రై ఫిష్ స్టాళ్లు, ఒక ఫుడ్‌కోర్టును ఇందులో నిర్మించారు.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలైన జెఎన్‌టీయు జంక్షన్, మలేషియా టౌన్‌షిప్, హైటెక్‌సిటీ ఫ్లైఓవర్, సైబర్ టవర్ జంక్షన్, మాదాపూర్, బాలానగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు రూ.83 కోట్లతో కైతలాపూర్ వద్ద నిర్మించనున్న ఆర్వోబీకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మొత్తం వ్యయంలో రైల్వే శాఖ రూ.16.06 కోట్లు కేటాయించగా, ఆర్వోబీ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ.40 కోట్లు, భూ సేకరణకు ప్రత్యేకంగా మరో రూ.25 కోట్లు కేటాయించింది. 676 మీటర్ల పొడువు, 16.61 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా ఆర్వోబీని నిర్మించనున్నారు.