హైదరాబాద్

విద్యా విధానంలో మార్పునకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రస్తుతం ఉన్న విద్యావిధానాన్ని సమూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ నిధులతో నిర్మించిన దత్తాత్రేయ బ్లాక్‌ను విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ప్రిన్సిపల్ రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు.
ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొదించేలా బోదన జరగడం లేదని అన్నారు. వంద కోట్ల మందికి పైగా జనాభా కలిగిన భారత్ దేశం వెనుకబాటుకు ఇదే కారణమని అన్నారు. ప్రతి విద్యార్థిని నైపుణ్యవంతుగా తీర్చిదిద్దితే దేశం వేగవంతంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం స్కిల్ డవలప్‌మెంట్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా విద్యావిధానంలో మార్పులు తీచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పేద విద్యార్ధులు చదువుకునే ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో వౌలిక వసతుల కల్పనకు తనవంతుగా నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ పోటీల్లోగెలుపొందిన ఎన్‌సీసీ విద్యార్థులకు మెడల్స్‌ను అందజేశారు.