హైదరాబాద్

వీడీఎస్‌తో అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్దీకరించేందుకు జలమండలి మరో ప్రయత్నాన్ని ప్రారంభించింది. అక్రమ నల్లా కనెక్షన్లు కల్గిన వారు స్వచ్చంధంగా ముందుకొచ్చి తమ వద్ద అక్రమ నల్లా కనెక్షన్ ఉందన్న విషయాన్ని వెల్లడిస్తే క్రమబద్దీకరిస్తామని జలమండలి ఎండీ దాన కిషోర్ తెలిపారు. రెవెన్యూ పెంపు అంశంపై ఆయన ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ వాలంటరీ డిస్‌క్లోజర్ స్కీం(వీడీఎస్)ను 90 రోజుల పాటు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా లభించిందని ఆయన వెల్లడించారు. ఈ స్కీం అమల్లో ఉన్నన్నీ రోజుల్లో అక్రమ నల్లా కనెక్షన్లు కల్గిన భవన యజమానులు ఆన్‌లైన్‌లో జలమండలి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపారు. రెగ్యులర్ కనెక్షన్ ఛార్జీలతో పాటు ఒక నెల బిల్లు మొత్తం చెల్లించటం ద్వారా వారి అక్రమ కనెక్షన్లను క్రమబద్దీకరించనున్నటుల్తెలిపారు. ఈ స్కీం గడువు ముగిసిన తర్వాత ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లను కల్గి ఉన్నా, క్రమబద్దీకరించేందుకు రెండు రేట్ల కనెక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో పాటు మూడు సంవత్సరాల వినియో ఛార్జీలతో పాటు రూ. 300 సర్వీసు ఛార్జిలు కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ క్రమంలో అక్రమ నల్లా కనెక్షన్లు కల్గిన వారు ఈ వీడీఎస్ స్కీంను సద్వినియోగం చేసుకుని క్రమబద్దీకరించుకోవాలని సూచించారు. వంద శాతం బిల్లింగ్, కలెక్షన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి నెల 5వ తేదీలోపు కమర్షియల్ కనెక్షన్లకు, 10వ తేదీలోపు అన్ని క్యాటగిరీలకు బిల్లులు జారీ అయ్యేలా ఎజెన్సీలను సమన్వయపర్చాలని రసూచించారు. లెక్కలోకి రాకుండా వృథాగా పోతున్న నీటిని అరికట్టి వేరే చోట సరఫరా అదనంగా జలమండలి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అక్రమ నల్లా కనెక్షన్ల గురించి ప్రతి నెల బిల్లింగ్ పరిధిలోకి తీసుకువస్తే ఆదాయం పెరుగుతుందని అధికారులకు సూచించారు. వీటితో పాటు రిజర్వాయర్ల లీకేజీలు, పైప్‌లైను లీకేజీలు, డూప్లికేటు పైప్‌లైన్ ద్వారా మంచినీటి సరఫరాను నిలిపివేసి వృథాను తగ్గించవచ్చునని సూచించారు. రిజర్వాయర్ల లీకేజీలు, ఇన్‌లెట్, ఔట్‌లెట్ పైప్‌లైను లీకేజీలను గుర్తించి, వాటి మరమ్మతులకు అంచనాలను రూపొందించి, ఐదు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆరు డివిజన్ల పరిధిలో 36వేల 547 కనెక్షన్లను సర్వే చేయగా, అందులో కొత్తగా 1401 సీవరేజీ కనెక్షన్లు, 633 కమర్షియల్ కనెక్షన్లు, 880 ఎంఎస్‌బీ కనెక్షన్లు, 721 అక్రమ నల్లా కనెక్షన్లు, 66 రికార్డులో నమోదు చేయని భవనం, ప్లాట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ వివరాల ప్రకారం ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో దాదాపు రూ. 6.24 కోట్లు, నెలనెల బిల్లుల ద ఆవరా సుమారు రూ. 16లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఈ సర్వే నిరంతరంగా నగరం నలువైపులా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ గుర్తించిన అక్రమ కనెక్షన్లకు నోటీసులు జారీ చేసి, వారం రోజుల తర్వాత అక్రమ నల్లా కనెక్షన్ క్రమబద్దీకరణ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఓ అండ్‌ఎం డైరెక్టర్లు అజ్మీరకృష్ణ, పి.రవితో పాటు పలువురు సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.