హైదరాబాద్

బల్దియా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-2021కు గాను మహానగర పాలక సంస్థ బడ్జెట్ రూపొందించింది. ఈ సారి కార్పొరేషన్‌ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నందున వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గిస్తూ రూ. 5380 కోట్లుగా బడ్జెట్‌ను రూపొందించారు. వర్తమాన సంవత్సరం 2019-2020కు గాను రూ.6150 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించగా, ఈ సారి రూ. 770 కోట్లు తగ్గించి రూ. 5380 కోట్లకే పరిమితమైంది. కానీ మేజర్ ప్రాజెక్టులకు వేరుగా రూ. 1593కోట్లు కేటాయించటంతో ఒక లెక్కకు వచ్చే సంవత్సరం బడ్జెట్ రూ. 823 కోట్లకు పెరిగినట్టేనని చెప్పవచ్చు. అధికారులు ఈ బడ్జెట్ ముసాయిదాను గురువారం జరిగిన స్థారుూ సంఘం సవేశంలో ప్రవేశపెట్టారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు, అధికారులు బడ్జెట్‌పై చర్చోపచర్చలు నిర్వహించినాన తర్వాత స్థారుూ సంఘం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌పై డిసెంబర్ 10న పూర్తి స్థారుూ సమీక్ష నిర్వహించాలని కూడా నిర్ణయించింది. డిసెంబర్ 15న కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో వచ్చే సంవత్సరం జనవరి 10న పూర్తి స్థాయిలో సమీక్షించి, ఫిబ్రవరి 20న కార్పొరేషన్ ఆమోదం తెలిపి, మార్చి 7వ తేదీన తదుపరి ప్రభుత్వ ఆమోదం కోసం సర్కారుకు పంపాల్సి ఉంటుందని కమిషనర్ లోకేశ్‌కుమార్ స్థారుూ సంఘానికి తెలపటంతో ఇందుకు స్థారుూ సంఘం అంగీకరించి, ఆమోదం తెలిపింది. బడ్జెట్ ముసాయిదాపై అధ్యయనం చేసిన తర్వాతే వచ్చే స్థాయి సంఘం సమావేశంలో చర్చించటానికి అనుమతి కోరుతూ స్థారుూ సంఘం సభ్యులు ప్రతిపాదించాలని సమావేశం తీర్మానించింది.
బడ్జెట్ వివరాలు
* 2019-2020 ఆమోదిత బడ్జెట్ రూ. 6150 కోట్లు
* 2019-2020 సవరించిన బడ్జెట్ మొత్తం రూ. 5254 కోట్లు
* 2020-2021కు ప్రతిపాదిత బడ్జెట్
మొత్తం రూ. 5380 కోట్లు
* మేజర్ ప్రాజెక్టులకు ప్రతిపాదిత బడ్జెట్ రూ. 1593 కోట్లు .

కీడాకారులకు స్వాగతం

హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్రంలో క్రీడారంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సహిస్తున్నారని క్రీడలు, యువజ సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఖత్తర్‌లో ఈనెల 3 నుంచి 14 వరకు జరిగిన 14వ ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ నుంచి పాల్గొని పతకాలు సాధించిన షూటర్స్ ఇషాసింగ్, ధనుష్ శ్రీకాంత్, అబిద్ అలీ ఖాన్, రుద్రరాజుకు మంత్రి అభినందనలు తెలిపారు. ఖత్తర్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న షూటర్ అబిద్ అలీ ఖాన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.