హైదరాబాద్

జాతీయ స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : జాతీయ స్థాయిలో బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులను కేటాయించి పేద బ్రహ్మణులకు ఆర్థిక సహాయం అందించాలని అల్ ఇండియా బ్రహ్మణ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి గౌరవ అధ్యక్షుడు గుండెపూడి రమా శంకర్ అన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ జాతీయ సదస్సును శనివారం నగరంలోని బ్రాహ్మణ భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండెపూడి రమా శంకర్ పాల్గొని ప్రసంగించారు. కమిటీ చైర్‌పర్సన్ కే.గీతామూర్తి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ జనగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. సదస్సులో దాదాపు 15 రాష్ట్రాల నుంచి బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆనంద్, తివారి, పుష్పందేర్ మిశ్రా, సురేష్‌శర్మ పాల్గొన్నారు.