హైదరాబాద్

కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో అక్రమంగా ఏర్పాటు చేయనున్న అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఇకపై కఠిన చర్యలు చేపట్టాలని వివిధ ముఖ్య శాఖలతో కూడిన సిటీ సమన్వయ కమిటీ తీర్మానం చేపట్టాలని వివిధ ముఖ్య శాఖలతో ఏర్పాటైన సిటీ సమన్వయ సమావేశం తీర్మానించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అధ్యక్షతన శనివారం సిటీ సమన్వయ సమావేశం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర సుందరీకరణ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, వివిధ ప్రారంభోత్సవాలు, ఇతర ఉత్సవాల సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారుల, కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే వారికి జరిమానాలు విధించటంతో పాటు అవసరమైతే కేసులు కూడా నమోదు చేయాలని సూచించారు. ఈ విషయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు కఠినంగా వ్యవహారించాలని ఆయన ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ద్వారా నిర్వహఇంచే అన్ని పార్కులకు ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. పాత ముంబై రహదారిలో క్యారేజ్ వే నిర్మాణఆనికి గాను అడ్డుగా ఉన్న మూడు దేవాలయాలను మరో చోట నిర్మించేందుకు తగిన స్థలాలను కేటాయించాలని రంగారెడ్డి జల్లా కలెక్టర్‌కు లేఖ రాయటం జరిగిందని, ఈ విషయంలో త్వరితగతిన భూమిని కేటాయించాలని లోకేశ్‌కుమార్ కోరారు. మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ధ మరో అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ఆస్తుల సేకరణకు నోటిఫికేషన్ ఆగస్టు 20వ తేదీన చేయటం జరిగిందని, వివరించారు. ఈ నెల 20వ తేదీలోపు జీహెచ్‌ఎంసీలోని అన్ని రహదారులపై ఉన్న గుంతలను పూడ్చివేయటంతో పాటు ప్యాచ్‌వర్కులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమల్లో వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం సాధించేందుకు గాను ప్రతి గురువారం నాడు జోనల్ స్థాయిలో కన్వర్జెన్సీ సమావేశాలను నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వెంకటనర్సింహరెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.