హైదరాబాద్

తెలంగాణ నట తేజం కాంతారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలంగాణ నట తేజం కాంతారావు అని ప్రముఖ కవి, గేయ రచయిత డా.వడ్డేపల్లి కృష్ణ అన్నారు. ప్రముఖ సినీ నటుడు టీ ఎల్ కాంతారావు జయంతి సందర్భంగా బృందావనం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డేపల్లి కృష్ణ పాల్గొని కాంతారావు చిత్ర పటానికి నివాళి అర్పించారు. కాంతారావు పౌరాణిక చిత్రాలలో అనేక పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని వివరించారు. ప్రముఖ గాయకుడు వై.మల్లికార్జునమ్ నిర్వహణలో గాయనీ, గాయకులు రాఘవరావు, భరద్వాజ, నిఖిల, ప్రభాకర్, పద్మావతి పాల్గొన్నారు.