హైదరాబాద్

నీటి సరఫరాలోనూ వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఎండలు మండిపోతుండటంతో మంచినీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు రోజురోజుకీ నీటికి డిమాండ్ పెరగటంతో అడిగిన వెంటనే ఎవరికి నీటిని సరఫరా చేయాలన్న విషయాన్ని తేల్చుకోలేని జలమండలి అధికారులు రాజకీయ వత్తిళ్లకు గురవుతున్నారు. ఫలితంగా మధ్య తరగతి ప్రజలు, పేదలు నివసించే బస్తీలు, మురికివాడలకు సాంకేతిక లోపాలున్నాయంటూ సరఫరా వేళలను కుదించటంతో పాటు ప్రత్యామ్నాయంగా నీటి సరఫరాను చేయాల్సిన వాటర్ ట్యాంకర్లను సైతం సంపన్నులకే అడిగినపుడల్లా పంపుతున్నారు. కానీ వాస్తవానికి అవే ట్యాంకర్లను పేదలు, సామాన్యులు అడిగిన ప్రాంతాలకు పంపితే వారు అవే నీటిని అమృతంలా సేవించి కాలం గడుపుతారు. కానీ రాజకీయ వత్తిళ్లు, కాసుల కక్కుర్తి కారణంగా ధనికవర్గాలు, సంపన్నులు, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు దారి మళ్లుతున్నా, ఈ ట్యాంకర్లలోని నీటిని డబ్బున్న బడాబాబులు తమ ఇంట్లోని మొక్కలకు, వాహనాలు శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్నారే తప్ప, సేవించేందుకు వినియోగించటం లేదన్న ఆరోపణలు ఎన్నో. నగరంలో భూగర్భ జలాలన్నీ అడుగంటి చుక్కనీరు దొరకని దుస్థితిలో కూడా నీటి సరఫరాలో తేడాలుంటున్నాయి. నీళ్ల అవసరాలు కల్గిన పెద్ద పెద్ద కంపెనీలకు సైతం వారికి కావల్సిన మోతాదులో నీళ్లు అమ్ముకుంటున్న జలమండలి అధికారులకు నీటి కొరత బాధితులుగా కేవలం బస్తీలు, మురికివాడల్లో నివసించే ప్రాంతాలనే బలిచేస్తున్నారన్న విమర్శ ఉంది. వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా కరవు నెలకొన్న రాష్ట్రాల్లో ఇప్పటికే అందరికీ సమాన నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నీటి సరఫరాపై జలమండలి అధికారులు వివక్షను ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్‌లో విలీనమైన శివార్లలోని పనె్నండు మున్సిపల్ సర్కిళ్లలో వారానికోసారి తాగునీటి సరఫరా కావటం, అదీ అందరికీ అందకపోవటంతో ప్రజలు మినరల్ వాటర్‌ను కొనుగోలు చేసి మరి గొంతు తడుపుకుంటున్నారు.
జూబ్లీహిల్స్‌కు రెండు గంటల్లో ట్యాంకర్
నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల కేటాయింపులోనూ వివక్ష చూపుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , మాదాపూర్ ప్రాంతాలకు సంబంధించిన ఆరో డివిజన్ ఫిల్లింగ్ స్టేషన్‌కు 200 పై చిలుకు వాటర్ ట్యాంకర్లను కేటాయించారు. జలమండలికి సంబంధించిన మొత్తం 985 ట్యాంకర్లలో అత్యధికంగా ఇదే డివిజన్‌కు కేటాయించారు. తీవ్ర నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఉచితంగా ట్యాంకర్లు పంపుతున్నామని అధికారులు చెబుతున్నా, అవి వారానికి ఒకటి మాత్రమే పరిమితమైంది. బస్తీలు, మురికివాడల ప్రజలు డబ్బులు వెచ్చించి ట్యాంకర్లు అడిగినా, రెండు రోజుల ముందే బుక్ చేసుకోవాలని నిబంధనలను సాకుగా చెబుతున్న అధికారులు అదే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ల నుంచి ఫోన్ రాగానే కనీసం ట్యాంకర్ కోరే వ్యక్తి క్యాన్ నెంబరు కూడా అడగకుండానే రెండు గంటల్లో ట్యాంకర్‌ను పంపుతున్నారు. అధికారులు అంత హడావుడి చేసి పంపిన ఆ ట్యాంకర్‌లోని నీరు చెట్లకు పోయటమో, ఇళ్లలోని వాహనాలను కడుక్కునేందుకు వినియోగించటం గమనార్హం.
బీర్ల కంపెనీలకు పుష్కలంగా నీరు
తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీటి అవసరాలు కల్గిన కంపెనీలకు నీళ్లను బంద్ చేసేలా ఇతర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ దిశగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకుంది. తీవ్ర నీటి ఎద్దడి ప్రాంతాల్లో హెలీప్యాడ్ కోసం నీళ్లు వృథా చేసినా, దానిపై స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు లబోదిబోమంటున్నాయి. కానీ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా, బీర్ల, కూల్‌డ్రింక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో వాటికనుగుణంగా జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. నగరంలో జలమండలి మార్చి నెలలో కోకాకోలా కంపెనీకి 4.73 కోట్లు, పెప్సీకోలాకు 3.72 కోట్లు, సౌత్ ఏషియా బ్రేవరీస్‌కు 2.30 కోట్లు, క్రౌన్‌బీర్స్ ఇంటర్నేషనల్‌కు 2.02 కోట్లు, యునైటెడ్ బ్రేవరీస్‌కు 3.90 కోట్ల నీటిని సరఫరా చేసింది.