హైదరాబాద్

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10శాతం రిజర్వేషన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ పెట్టాలని పలువురు వక్తలు అన్నారు. ఆల్ ఇండియా బ్రహ్మణ ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో జాతీయ బ్రహ్మణ సదస్సు ముగింపుసభ ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనా రెడ్డి, ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీఐజీ జుగల్ కిషోర్ తివారీ, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్, గాయనీ మాళవిక పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో విశ్వాసంతో అగ్రవర్ణ పేదలకు ప్రవేశ పెట్టిన 10 శాతం రిజర్వేషన్లు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి గౌరవ చైర్మన్ రమా శంకర్, కమిటీ చైర్‌పర్సన్ గీతామూర్తి, గోపీ కృష్ణమాచార్యులు, పగిడిమర్రి శ్రీనివాస్ శర్మ, రాంమోహన్ రావు, సత్యనారాయణ, రాధాసుద పాల్గొన్నారు.