హైదరాబాద్

స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు తెలంగాణ ఎన్‌జీవో లీడర్‌షిప్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మసాబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)కు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. వరల్డ్ సీఎస్‌ఆర్ డే సందర్భంగా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌సీఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ రంజి క్రికెటర్ కే.సాయిబాబాకు పురస్కారాన్ని తెలంగాణ ఎన్‌జీవో లీడర్‌షిప్ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల చారి, పెద్దపల్లి కలెక్టర్ దేవసేనా అందజేశారు. 30 సంవత్సరాలుగా క్రీడల్లో చిన్నారులకు శిక్షణనిస్తూ అనేక మందిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు రెండు గ్లోబల్ అవార్డులతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు లభించాయి. 1991లో మసాబ్‌ట్యాంక్‌లోని మురికివాడ ప్రాంతంలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసిన సాయిబాబా చిన్నారులకు క్రికెట్, కరాటే, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి అనేక క్రీడల్లో నైపుణ్యం కలిగిన కోచ్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించారు. ఇటీవలి కాలంలో సాయిబాబా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ క్రీడ వసతుల వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించేందుకు కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశామని సాయిబాబా తెలిపారు.