హైదరాబాద్

ఉద్యోగాల భర్తీకి 20న జాబ్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు, విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మరో జాబ్ మేళాను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. భాష్యం డెవలపర్స్, హెచ్‌ఆర్ సొల్యూషన్, ఇన్నోప్ సోర్సు, మెగారియాస్ సొల్యూషన్స్ అనే నాలుగు కంపెనీల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టులను ఈ మేళాలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ చదివిన అభ్యర్థులకు మార్కెటింగ్ ఏజెంట్స్, టీం లీడర్ సేల్స్, హెల్పర్, సేల్స్ ఎగ్జిక్యూటీవ్, అకౌంటెంట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్, బ్రాంచ్ రిలేషన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను ఈ మేళాలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వారికి కేటాయించిన ఉద్యోగాన్ని బట్టి రూ.10వేల నుంచి రూ. 18వేల వరకు జీతం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల సర్ట్ఫికెట్ల జిరాక్స్‌లతో 20వ తేదీన ఉదయం పదిన్నర గంటలకు విజయనగర్‌కాలనీ సమీపంలోని మల్లేపల్లిలోని జిల్లా ఉపాధి అధికారి ఆఫీసుకు రావల్సి ఉంటుందని తెలిపారు.