హైదరాబాద్

పరీక్షలకు ప్లాన్‌తో సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఓ ప్లాన్‌తో సిద్దం కావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విభాగం మంగళవారం నాంపల్లి వనితా మహావిద్యాలయంలో కౌన్సిలర్లతో వారికి ప్రత్యేక కౌనె్సలింగ్‌ను నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కౌనె్సలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఇలాంటి కౌన్సిలింగ్‌లు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతాయని అన్నారు. విద్యార్థులు పరీక్షల సమయంలోనే అధిక వత్తిడికి గురవుతుంటారని, తద్వారా ఆత్మహత్యలకు ప్రేరేపితులై జీవితాలను కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తున్న ప్రయత్నమే ఈ కౌనె్సలింగ్ అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే వయస్సులోని విద్యార్థుల్లో శారీరక, మానసిక మార్పులు కలుగుతాయని, ఈ సమయంలోనే వారికి తల్లిదండ్రులు, అధ్యాపకుల సహాకారం ఎంతో అవసరమని సూచించారు. ఈ కౌనె్సలింగ్ విద్యార్థులకు బోధించిన అంశాలను కచ్చితంగా అనుసరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా వారి జీవితానికి బంగారు బాట వేయగలమని పేర్కొన్నారు. తరగతిలో తక్కువ మార్కులు వచ్చే విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులను, పాఠ్యాంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ సెక్రటరీ డా.బి.జనార్దన్ రెడ్డి మాట్లాడితూ సమాజంలోని ప్రతి ఒక్కరికి ఎదో రకమైన ఒత్తిడి ఉంటుందని, విద్యార్థులలో ఉండే పరీక్షల వత్తిడి వల్ల కొందరు జీవితాలనే కోల్పోతున్నారని, దాన్ని అధిగమించటానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు, శిక్షణ ఇస్తూ ఏ రోజు పాఠ్యాంశాలను అదే రోజు చదవడం, శ్రద్ధగా వినడం, క్రమం తప్పకుంకడా కాలేజీకి హాజరుకావటం మొదలైన అంశాలపై విద్యార్థులు దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టి, వారి విజయానికి తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించాలని అన్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోని ప్రభుత్వం ఇంటర్ కాలేజీల నుంచి ఎంపిక చేసిన అధ్యాపకులకు రెండురోజు పాటు ఈ కౌనె్సలింగ్ శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డా.బీ.యూ బహుగుణ సారథి రచించిన ‘ప్లాస్మా టెక్నాలజీ’ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన కార్యక్రమంలో వనితా మహావిద్యాలయ ప్రిన్సిపాల్ శోభన, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు సరోత్తంరెడ్డి, డా.వీరేందర్, డీఐఓ జయప్రద హాజరయ్యారు.