హైదరాబాద్

టీవీ ఆర్టిస్టులకు హెల్త్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీవీ ఆర్టిసులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించనున్నట్లు, ఇందులో భాగంగా త్వరలోనే వారికి హెల్త్‌కార్డులను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఇందుకు గాను జనవరి నెల మొదటి వారంలో ఆర్టిస్టులందరికీ గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లోని మంత్రి కార్యాలయంలో టీవీ ఆర్టిసుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం టీవీ ఆర్టిస్టుల సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పెన్షన్లు టీవీ ఆర్టిస్టుల్లో అర్హులైన వారందరికీ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. టీవీ ఆర్టిస్టులు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, లబ్ది పొందాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఎఫ్‌డీసీ సీఐఓ కిషోర్‌బాబు, టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు వినోద్‌బాల, కార్యదర్శి విజయ్‌యాదవ్, భార్గవ, లోహిత్, నాగమణి, శశాంక, విజయ్‌రెడ్డి, రాజమాధురి, జయవాణి తదితరులు హాజరయ్యారు.