హైదరాబాద్

‘ఆడది’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ రచయిత్రి తరిమిశ జానకి రచించిన ‘ఆడది’ ఆవిష్కరణ సభ మహిత సాహితీ సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త విహారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. తరిమిశ జానకి అనేక ప్రక్రియాల్లో రచనలు చేశారని పేర్కొన్నారు. ఆమె రచనలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ప్రముఖ రచయిత సుధామ సభాధ్యక్షత వహించగా గానసభ అధ్యక్షుడు కళా జానర్దన మూర్తి, కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మీ, రచయిత్రి ముక్తేవి భారతి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శి స్వాతి శ్రీపాద, శిష్టా మాధవి పాల్గొన్నారు.
‘పద్యానికి పట్ట్భాషేకం’
పద్య నాటకోత్సవాలు
కాచిగూడ, నవంబర్ 20: కినె్నర ఆర్ట్ థియేటర్స్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ‘పద్యానికి పట్ట్భాషేకం’ ఈనెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రవీంద్ర భారతిలోని ఘంటసాల కళావేదికలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పద్యానికి పట్ట్భాషేకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమానికి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రముఖ సాహితీవేత్త వోలేటి పార్వతీశం, కినె్నర కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.