హైదరాబాద్

నిరాశ్రయులకు ఆశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో క్రమంగా చలి ప్రభావం పెరుగుతున్నందున, నిరాశ్రయులను గుర్తించి వారికి ఆశ్రయాన్ని కల్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. అధికారులు నగరంలోని అన్ని నైట్ షెల్టర్లను తనిఖీ చేసి, అక్కడ ఏర్పాటు చేయాల్సిన వౌలిక వసతులు, అవసరమైన అభివృద్ధి పనులు తనకు తెలియజేయాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. వివిధ అంశాలపై బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల వద్ధ రాత్రిపూట నిద్రించే వారికి నైట్ షెల్టర్‌లలో ఆశ్రయం కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో 15 నైట్ షెల్టర్లు ఉన్నాయని, వీటిలో సుమారు 600 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. నిరాశ్రయులకు రాత్రివేళల్లో ఆశ్రయం కల్పించేందుకు అవసరమైతే జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాళ్లను కూడా వినియోగించుకోవచ్చునని సూచించారు. కొద్దిరోజులుగా నగరంలోని జంక్షన్లు, కూడళ్లలో యాచకుల సంఖ్య పెరిగిపోయిందని, దీన్ని తగ్గించేందుకు పోలీసు శాఖతో కలిసి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ డ్రైవ్‌లో భాగంగా ఈ-వ్యర్థాలను వేసేందుకు ప్రతి వార్డులో ఖాళీ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ అమర్చిన 60 వాహానాలతో నగరంలోని 9వేల కిలోమీటర్ల రోడ్డు ప్రధాన రహదారుల్లో ఫాగింగ్ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 2021 జాతీయ జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైనందున, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న ఆస్తిపన్ను వసూళ్లను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు.