హైదరాబాద్

అప్పులకుప్ప బల్దియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని కోటి మంది జనాభాకు అత్యవసరమైన, అవసరమైన సేవలతో పాటు అభివృద్ధి పనులు చేపట్టే జీహెచ్‌ఎంసీ క్రమంగా అప్పుల కుప్పలో కూరుకుపోతోంది. ఏడాదికి రూ.1400 కోట్ల ఆస్తిపన్ను, మరో రూ.500 కోట్ల నిధులు టౌన్‌ప్లానింగ్ రెవెన్యూ కింద సమకూరుతున్నా, మరో మూడేళ్ల పాటు అప్పుల ఊబిలోనే విలవిలలాడే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల కోసం రూ.495 కోట్లు బకాయి పడగా, హడ్కో నుంచి రుణంగా రూ.140 కోట్లు తీసుకుంది. ఈ రెండు రకాల అప్పులకు ఏడాదికి 9.5శాతంతో సుమారు రూ.70 కోట్ల వరకు వడ్డీలను చెల్లిస్తోంది. ప్రస్తుతం ఆస్తిపన్ను వసూళ్లు, టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా సమకూరే నిధులతోనే జీహెచ్‌ఎంసీలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నవంబర్ మాసం జీతాలు చెల్లించేందుకు కూడా రెండు రకాల ఆర్థిక వనరులపైనే ఆధారపడింది. కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోయినా, రొటీన్ మెయింటనెన్స్, జీతాలు పెన్షన్లు, కార్మికుల వేతనాలను చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.150 కోట్ల నిధులు కావాలి. దీంతో పాటు రొటీన్ మెయింటనెన్స్ కింద చేపట్టిన పనుల కోసం అన్ని జోన్లకు నెలకు మరో రూ.100 కోట్లతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో నెల చివర్లో జీహెచ్‌ఎంసీ రూ.250 కోట్లను వెచ్చిస్తోంది. పర్మినెంట్ ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపునకు రూ.50 కోట్లు, ఔట్‌సోర్సు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల చెల్లింపునకు రూ.35 కోట్లు, రూ.పది కోట్లు కరెంట్ బిల్లులు, మరో రూ.ఐదు నుంచి రూ.ఆరు కోట్ల వరకు ఇంధనం, రూ.పది కోట్లు శానిటేషన్‌కు, పెన్షన్లు, రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్ల చెల్లింపులన్నీ కలుపుకుని రూ.150 కోట్లను వెచ్చిస్తుండగా, ఆపరేషన్, మెయింటనెన్స్ కింద రొటీన్ పనులకు చెల్లించాల్సిన రూ.వంద కోట్లతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో రూ.250 కోట్లు నెలకు ఖర్చవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.900 కోట్లు రోడ్లకు, రూ.400 కోట్లు ఎస్‌ఆర్‌డీపీకి, శానిటేషన్‌కు రూ.800 కోట్లను వెచ్చించారు.
పనులకు మార్చిలో బిల్లుల చెల్లింపు
రొటీన్ మెయింటనెన్స్‌కు సంబంధించి సెప్టెంబర్ మాసం వరకు బకాయి ఉన్న సుమారు రూ.900 కోట్ల బిల్లులన్నీ చెల్లించిన బల్దియా ఆ తర్వాత జరిగే పనులకు వచ్చే మార్చి మాసం తర్వాతే బిల్లులు చెల్లించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రూ.800 కోట్ల వరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు జీహెచ్‌ఎంసీ చెల్లించాలా అనే ప్రశ్నకు మనకు సంబంధం లేదని, జీహెచ్‌ఎంసీ కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే చేస్తోందని అధికారులు చెబుతున్నారు. బిల్లులు క్లియర్ చేసిన సెప్టెంబర్ మాసం నుంచి మార్చి నెల వరకు సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఉన్నాయని, ఇందులో స్థల సేకరణ నష్టపరిహారం చెల్లింపులే ఎక్కువ ఉండవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు.